కాలువలో రైతు గల్లంతు
శ్రీ కాళహస్తి: మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన ఓ రైతు కాలువలో కొట్టుకుపోయి గల్లంతు అయ్యారు. వివరాల్లోకి వెళితే.. నారాయణపురం గ్రామంలో నివాసం ఉంటున్న బీసీ కులానికి చెందిన జయరామయ్య(70) గురువారం సుమారు 11 గంటలకు తన ఆవులను మేత కోసం తీసుకెళ్లాడు. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోని ఈదురు కాలువ దాటుతున్న సమయంలో వాగులో గల్లంతైన సంఘటన గ్రామస్తులు లేటుగా గుర్తించారు. జయరామయ్య గల్లంతు విషయం తెలుసుకున్న బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్లతంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి శుక్రవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని, వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ వ్యక్తి కాలువలో పడి 24 గంటలు గడుస్తున్నా అధికారుల స్పందించకపోవడం బాధాకరమన్నారు.
కాలువలో రైతు గల్లంతు


