మత్స్యకారుల సమస్యలను పరిష్కరిద్దాం
తిరుపతి అర్బన్: మత్స్యకారుల సమస్యలను సమష్టిగా చర్చించుకుని పరిష్కరించుకుందామని రాష్ట్ర బెస్త కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ మత్స్యకారులకు రావాల్సిన అన్ని రాయితీలు పొందడానికి వీలుగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. రాయితీతో వచ్చే అన్ని యూనిట్లు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు చెరువుల పరిధిలో ఏర్పాటు చేసుకున్న మత్స్యకారుల కమిటీల ఆధ్వర్యంలో పేద మత్స్యకారులకు తప్పకుండా న్యాయం చేసేలా చూడాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బెస్త కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్లు ఏకాంబరం, కే.శ్రీధర్, బి.పళణితోపాటు పీఏసీ సొసైటీ డైరెక్టర్ సుధాకర్, జీసీఎఫ్ ప్రాజెక్టు జిల్లా కో–ఆర్డినేటర్ జస్వంత్, ఏపీసీఓఎఫ్ వైస్ ప్రెసిడెంట్ సుందరమూర్తి, మత్స్యశాఖ తిరుపతి డివిజన్ అధికారి వెంకటరమణ పాల్గొన్నారు.


