
ఉద్యోగ అవకాశాలు పుష్కలం
చిల్లకూరు:భవిష్యత్తు తరాల వారికి జిల్లాలో ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గూడూరు ప ట్టణంలోని దువ్వూరు రమణమ్మ మ హిళా కళాశాలలో గురువారం రా ష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 బహుళ సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఈ మేళాకు 414 మంది అభ్యర్థులు హాజరు కాగా 278 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసి, నియామక పత్రాలు అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనన్, గూడూరు డీఎస్పీ గీతాకుమారి, నైపుణాభివృద్ధి అధికారి లోకనాథం, కళాశాల కరస్పాండెండెంట్ మోహర్మణి, కళాశా ల కార్యదర్శి విద్యాసాగర్, ఎంపీడీఓ మధుసూదన్‌రావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
రూ.7 కోట్లతో బ్యారేజ్ మరమ్మతుకు ప్రతిపాదనలు
వాకాడు: స్వర్ణముఖి బ్యారేజ్ మరమ్మతులకు రూ.7 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఇరిగేషన్ అధికారులతో కలసి వాకాడు–స్వర్ణముఖి బ్యారేజ్‌ని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇకపై ఏటా బ్యారేజ్ పరికరాల నిర్వాహణకు జిల్లా నుంచి రూ.12 లక్షలు కేటాయించడం జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్ వాకాడులోని ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఎస్‌ఈ రాధాకృష్ణ, ఈఈ బాబు, డీఈలు, ఎంపీడీఓ శ్రీనివాసులు ఉన్నారు.
సాగరమాల సర్వీసు రోడ్ల సమస్యలపై పరిశీలన
నాయడుపేటటౌన్: సాగరమాల సర్వీసు రోడ్ల సమస్యలపై గురువారం కలెక్టర్ వెంకటేశ్వర్, ఆర్డీఓ కిరణ్మ యి, ఎన్‌హెచ్ అధికారులు, తహసీల్దార్ రాజేంద్ర పరిశీలించారు. మండలంలోని నరసారెడ్డికండ్రిగ సమీపంలో సాగరమాల రహదారి వద్ద కలెక్టర్ రైతులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సాగరమాల రహదారి నిర్మాణ పనులతో పొలాలకు ఇరువైపుల సర్వీసు రోడ్లు లేకుండా చేస్తున్న విషయం రైతు సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు కలెక్టర్ సానూకులంగా స్పందించారు. రైతుల సంఘం నాయకులు జలదంకి వెంకటకృష్ణారెడ్డి, సన్నారెడ్డి హ రినాఽథ్‌రెడ్డి, కామిరెడ్డి మధుసూదన్ రెడ్డి, విజయసా రథి రెడ్డి, మచ్చా భాస్కర్, శిరిష్ రెడ్డి పాల్గొన్నారు.