దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం వికలత్వాన్ని తగ్గించడం చాలా ప్రమాదం. పింఛను పోవడమే కాదు. భవిష్యత్తులో యువకులైన దివ్యాంగులకు కళాశాలల్లో ఉన్నత చదువులకు సీట్లు దక్కవు. ఉద్యోగాలు రావు. ప్రభుత్వ పథకాలు అన్నింటికి అనర్హులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. దివ్యాంగుల జీవితాలు అంధకారం చేయనున్నారు. న్యాయం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. – మురళీగౌడ్, దివ్యాంగుల సేవా సమితి వ్యవస్థాపకుడు
ప్రాణాలు పోయేవరకు పోరాడుతాం
ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో దివ్యాంగుల పింఛన్లు తొలగించారు. మా జీవనం ప్రశ్నార్థకంగా మారింది. దివ్యాంగులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. తొలగించిన అందరి పింఛన్లు తిరిగి ఇవ్వాలి. లేదంటే ప్రాణాలు పోయోవరకు పోరాటాలు చేస్తాం.
– శ్రీనివాసులు, దివ్యాంగుల సేవా సమతి జిల్లా అధ్యక్షుడు
వికలత్వం తగ్గించడం భవితకే ప్రమాదకరం