
మూగ, చెవుడుతో బాధపడుతున్నాను. ప్రతి నెల రూ.6వేలు దివ్యాంగుల పింఛన్ ఇస్తున్నారు. 80 శాతం వికలత్వం ఉన్నట్లు గతంలో సర్టిఫికెట్ ఇచ్చారు. తాజా సర్వేలో 75శాతం వికలత్వం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో పింఛన్ తొలగించడంతో తండ్రితో కలసి న్యాయం కోసం కలెక్టరేట్‌లో జరిగిన ధర్నాలో పాల్గొన్నాను.
– భువనశ్రీ, తిరుచానూరు
వైకల్యశాతం తగ్గించి..పింఛన్ తొలగించారు
నాకు పింఛన్ ఎంతో ఆధారంగా ఉండేది. దాన్ని తొలగించారు. డాక్టర్లు 51 శాతం వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. డాక్టర్లు అడ్డదిడ్డంగా సదరం సర్టిఫికెట్లను జారీ చేశారు. దాంతో రూ.6 వేలు పింఛన్ తొలగించారు. ఏళ్ల తరబడి పింఛన్ తీసుకుంటున్నాను. ప్రస్తుతం తొలగిస్తే ఎలా బతకాలి. ప్రభుత్వం దివ్యాంగులకు అన్యాయం చేస్తోంది.
–జ్యోతీశ్వర్‌బాబు, పాకాల