
తిరుపతి అర్బన్ : 40 శాతం అంతకంటే ఎక్కువ వికలత్వం ఉన్నట్లు తాత్కాలిక సదరం సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులకు పింఛన్లు యథావిధిగా సెప్టెంబర్‌లో అందిస్తారని కలెక్టర్ వెంకటేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు ఇటీవల సచివాలయ ఉద్యోగుల ద్వారా అందించిన నోటీసులను తిరిగీ కార్యదర్శులు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఆ మేరకు ప్రభుత్వం ఆదేశాల ఇచ్చిందని స్పష్టం చేశారు. అలాగే తాము అర్హులం అయినప్పటికీ రీవెరిఫికేషన్‌లో అనర్హులుగా గుర్తించి నోటీసులు అందుకున్న దివ్యాంగులు తమ పరిధిలోని ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో 30 రోజుల్లో అప్పీలు చేసుకోవాలని కలెక్టర్ వెల్లడించారు.