Post Office: వదంతులు.. అగచాట్లు! | - | Sakshi
Sakshi News home page

Post Office: వదంతులు.. అగచాట్లు!

Nov 27 2024 7:21 AM | Updated on Nov 27 2024 1:05 PM

-

రేణిగుంట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అందించే సబ్సిడీ పోస్ట్‌ ఆఫీస్‌లో అకౌంటు ఉన్న మహిళలకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని వస్తున్న వదంతులతో మహిళలు స్థానిక పోస్టాఫీసు కార్యాలయానికి క్యూ కట్టారు. మంగళవారం రేణిగుంట పోస్ట్‌ ఆఫీస్‌లో వ్యక్తిగత ఖాతాలు తెరిచేందుకు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 

బ్యాంకు ఖాతాలు ఉన్న వారు ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ లింక్‌ చేసుకుంటే సరిపోతుందని అధికారులు చెప్తున్నారు. అయితే కచ్చితంగా పోస్ట్‌ ఖాతా ఉండాలని పుకార్లు రావడంతో మహిళలు అయోమయంలో పడుతున్నారు. దీనిపై అధికారులు సరైన సమాచారం ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement