పశువులు మేపుకుంటున్న ఎంపీటీసీ అభ్యర్థిపై దాష్టీకం! | Police In Nellore Attempt to kidnap MPTC candidate while grazing cattle | Sakshi
Sakshi News home page

పశువులు మేపుకుంటున్న ఎంపీటీసీ అభ్యర్థిపై దాష్టీకం!

Oct 24 2026 6:33 PM | Updated on Oct 24 2026 7:03 PM

Police In Nellore Attempt to kidnap MPTC candidate while grazing cattle

నెల్లూరు జిల్లా:  స్థానిక ఎన్నికల అంశానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అరాచకం శ్రుతిమించిపోయింది. తమకు పోటీగా ఎవరూ ఉండకూడదనే భావనలో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కూటమి సర్కారు.. వైఎస్సార్‌సీపీ నేతల పట్ల అత్యంత పాశవికంగా వ్యవహరిస్తుంది. కూటమి ప్రభుత్వం ఆదేశాలతో పోలీసుల ఓవరాక్షన్‌ మరోస్థాయికి వెళ్లిపోయింది.

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీకి దిగిన ఓ ఎంపీటీసీ అభ్యర్థిని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు పోలీసులు. చిరమనలో వైఎస్సార్‌సీపీ నుంచి ఎంపీటీసీగా నామినేషన్ వేసిన అభ్యర్థిపై దౌర్జన్యం చేశారు పోలీసులు. పొలాల్లో పశువులు వేపుకుంటున్న అభ్యర్థిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు పోలీసులు. 

పొలాల్లో గేదెలు మేపుకుంటున్న అభ్యర్థినిపై కేసులు ఉన్నాయంటూ లాక్కెళ్ళే ప్రయత్నం చేశారు. అక్కడ  గేదెల మేపుకునే వారిపై ఏఎస్ పేట ఎస్సై దాష్టికం ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ నుంచి నామినేషన్‌ వేసిన చిరమన  ఎంపీటీసీ అభ్యర్థిని విత్ డ్రా చేయాలంటూ ఒత్తిడి చేశారు. నామినేషన్ల వ్యవహారంలో ఈసీ ఇప్పటికే హెచ్చరికలు చేసినా ని ఏఎస్ పేట లెక్క చేయలేదు. 

ఇదీ చదవండి:  జనసేనకు డిపాజిట్లు కూడా రాకూడదు.. !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement