షర్మిలకు వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను రిలీజ్‌ చేసిన వైఎస్సార్‌సీపీ | YSRCP releases YS Jagans letter written to Sharmila | Sakshi
Sakshi News home page

షర్మిలకు వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను రిలీజ్‌ చేసిన వైఎస్సార్‌సీపీ

Oct 24 2026 4:18 PM | Updated on Oct 24 2026 4:50 PM

YSRCP releases YS Jagans letter written to Sharmila
  • వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తుండటంతో లేఖ రిలీజ్ చేసిన వైఎస్సార్‌సీపీ

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు నాయుడు వాస్తవాలను తప్పుదోవ పట్టించడంతో వైఎస్సార్‌సీపీ స్పందించింది. స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు.. దాన్ని పక్కదోవ పట్టించడానికి వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తింది.  ఈ మేరకు వైఎస్‌ జగన్‌.. షర్మిలకు రాసిన లేఖను విడుదల చేసింది. 

‘రాష్ట్రాన్ని చంద్రబాబు రావణకాష్టంగా మార్చారు. పక్కా ప్రణాళికాబద్దమైన దాడులతో స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు. ఆ విషయాలను పక్కదోవ పట్టించడానికే  వైఎస్.జగన్‌ మీద వ్యక్తిగత దాడి చేస్తున్నారు. నామినేషన్‌ కేంద్రాలనే దాడులకు అడ్డాలుగా మార్చింది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు చేయించిన దాడులతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయి. 

వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటంతో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలోని పరిస్థితులను బట్టబయలు చేశాయి. స్థానిక ఎన్నికల్లో జరిగిన దాడులు, అక్రమాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో సహా జగన్ బయట పెట్టారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టులు, తటస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వాస్తవాలను కప్పిపుచ్చేందుకు వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్లకూడదనే షర్మిలకి జగన్‌ రాసిన లేఖను విడుదల చేస్తున్నాం’ అని వైఎస్సార్‌సీపీ పేర్కొంది.

షర్మిలకు వైఎస్‌ జగన్‌ రాసిన లేఖలో ముఖ్యాంశాలు..

  • అంజిలి పెళ్లి గురించి తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది.

  • గత ఏడేళ్లుగా మన మధ్య ఎన్ని పరిణామాలు జరిగినా, అంజిలి జీవితాంతం సంతోషంగా, ప్రేమానురాగాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • నా అభ్యంతరాలను పట్టించుకోకుండా బెంగళూరులోని నా నివాసంలోనే పెళ్లి నిర్వహించాలని నువ్వు భావిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది.

  • నేను నివసిస్తున్న ప్రాంగణంలో పెళ్లి నిర్వహించడం వల్ల తీవ్రమైన భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి.

  • ఈ విషయాన్ని ఇప్పటికే వివిధ వ్యక్తుల ద్వారా నీకు తెలియజేశాను.

  • పెళ్లి వంటి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు. క్యాటరింగ్‌, డెకరేషన్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, అతిథులు ఇలా ఎంతోమంది ప్రాంగణంలోకి వస్తారు.

  • వీరిలో చాలామంది మనకు కనీసం పరిచయం కూడా లేని వ్యక్తులే.

  • ఇంతమంది నివాస ప్రాంగణంలోకి రాకపోకలు సాగించడం వల్ల తీవ్రమైన భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి.

  • నివాస ప్రాంగణానికి, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లడం భద్రతాపరమైన ఆందోళనలకు దారితీస్తుంది.

  • ఈ నిర్ణయం తీసుకోవడం నాకు అంత సులభం కాలేదు.

  • అంజలీ చిన్నప్పటి నుంచి పెరుగుతూ రావడాన్ని నేను చూశాను. ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను.

  • అయినప్పటికీ భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ముప్పులను ఏమాత్రం విస్మరించలేను.

  • హర్ష లేదా వర్ష పెళ్లి అయినా కూడా నేను ఇదే నిర్ణయం తీసుకునేవాడిని.

  • ప్రస్తుతం నేను ఇక్కడే నివసిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల అనవసరంగా అందరి దృష్టి ఈ నివాసంపై పడుతుంది.

  • చివరకు ఇది నా ఇల్లు. ఇక్కడ నేను, నా కుటుంబం సురక్షితంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాను.

  • భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఆందోళనలను ఇప్పటికే నీకు తెలియజేసినా, నా అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం నన్ను బాధించింది.

  • ఈ విషయంలో నా పరిస్థితిని, అభిప్రాయాన్ని మరోసారి పరిగణనలోకి తీసుకుని పెళ్లి కోసం మరో వేదికను ఎంచుకోవాలని కోరుతున్నాను.

  • రాజా పెళ్లి చేసినట్లుగా కన్వెన్షన్‌ సెంటర్‌లో గానీ, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ వేదికలో గానీ పెళ్లి నిర్వహించుకోవచ్చు.

  • అలాంటి వేదికలు ఇష్టం లేకపోతే హైదరాబాద్‌లోని నా లోటస్‌ పాండ్‌ ఆస్తిని పెళ్లికి ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాను.

  • వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ లేఖ
  • లోటస్‌ పాండ్‌ ఆస్తిని ఉపయోగించుకోవడానికి ఇచ్చిన ప్రతిపాదన ఇప్పటికీ అలాగే ఉంది.

  • అంజిలీ పెళ్లి ఆమె జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • భవిష్యత్తులో ఆ రోజును ఆమె ఎంతో ఆనందంగా గుర్తుచేసుకోవాలని ఆశిస్తున్నాను.

  • అందుకోసం సహేతుకంగా నేను చేయగలిగిన ప్రతి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను.

  • ఈ విషయంలో నువ్వు కూడా నా దృక్కోణాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను..

ఇదీ చదవండి:  వారం రోజులుగా దాడులు కొనసాగుతున్నాయి: రాచమల్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement