పీసుమామిడి పేలుడు ఘటన.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి | YS Jagan React On Alluri District Blast Incident | Sakshi
Sakshi News home page

పీసీమామిడి పేలుడు ఘటన.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Oct 24 2026 12:44 PM | Updated on Oct 24 2026 1:00 PM

YS Jagan React On Alluri District Blast Incident

సాక్షి, తాడేపల్లి: అల్లూరి జిల్లాలోని పీసుమామిడి పేలుడు ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక పరిహారం అందించాలన్నారు.

పీసుమామిడి పేలుడు ఘటనపై వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ..‘ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ దుర్గటనలో కార్మికులతోపాటు ప్రభుత్వ టీచర్ సునీత కూడా మృతి చెందడం అత్యంత బాధాకరం. ఉపాధి కోసం వచ్చిన కార్మికులు, విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయురాలు ఇలా ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక పరిహారం అందించాలి. వారికి అన్ని విధాలుగా అండగా నిలవాలి’ అని అన్నారు. 

ఇదీ చదవండి: ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement