వారం రోజులుగా దాడులు కొనసాగుతున్నాయి: రాచమల్లు | Rachamallu Siva Prasad Reddy on AP Local Body Elections 2026 | Sakshi
Sakshi News home page

వారం రోజులుగా దాడులు కొనసాగుతున్నాయి: రాచమల్లు

Oct 24 2026 3:57 PM | Updated on Oct 24 2026 4:15 PM

Rachamallu Siva Prasad Reddy on AP Local Body Elections 2026

వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. 

‘‘టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల వ్యవహారాలపై వారం రోజులుగా దాడులు కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. 

ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయకుండానే ఏకగ్రీవాల పేరుతో ప్రక్రియ ముగిసే పరిస్థితి ఏర్పడింది. నామినేషన్ల పరిశీలనకు మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించాం. దీంతో వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన వారికి గాయాలైనా పట్టించుకోవడం లేదు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డిపై దాడి జరిగినా, మహిళా అభ్యర్థులతో దురుసుగా ప్రవర్తించినా చర్యలు తీసుకోవడం లేదు.

ప్రొద్దుటూరు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా ఓబయ్య యాదవ్ నామినేషన్ వేసి తిరిగి వస్తుండగా, టీడీపీ అభ్యర్థి బచ్చల ప్రతాప్ తమ అభ్యర్థిపై, ప్రపోజర్‌పై దాడికి పాల్పడ్డారు. ప్రపోజర్‌ను కిడ్నాప్ చేశారని పేర్కొంటూ చెన్నూరు పోలీస్ స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఓబయ్య ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై చెన్నూరు పోలీసులు ప్రొద్దుటూరు రూరల్ సీఐకి సమాచారం ఇచ్చారు. ప్రపోజర్‌ను కుటుంబ సభ్యులతో మాట్లాడించిన పోలీసులు వెంటనే ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, కొండారెడ్డికి అప్పగించారు’’ అని తెలిపారు.

అది ఎలా చెల్లుబాటు అవుతుంది?
టీడీపీ బచ్చల పుల్లయ్య కుమారుడు బచ్చల వీరప్రతాప్‌కు సంబంధించిన నామినేషన్ల అంశంపై కూడా రామచల్లు స్పందించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్‌ను అధికారులు స్వీకరించడంతో పాటు, పరిశీలనలోనూ అంగీకరించారు. చైర్మన్ అభ్యర్థిత్వానికి సంబంధించిన నామినేషన్‌ను ఉపసంహరించుకుని జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తే అది ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నించారు. టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాఘవరెడ్డి నామినేషన్ చెల్లదని పేర్కొంటూ, వైఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో న్యాయస్థానంలో పోరాటం చేస్తానని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: బైక్‌ను ఢీకొట్టి, బైకర్‌ను కిడ్నాప్‌ చేసి.. చంపేసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement