సైలెంట్‌గా రెండుచోట్ల సిరిసహస్ర నామినేషన్‌ | Siri Sahasra files nomination for ZPTC in Vizianagaram | Sakshi
Sakshi News home page

సైలెంట్‌గా రెండుచోట్ల సిరిసహస్ర నామినేషన్‌

Oct 24 2026 1:13 PM | Updated on Oct 24 2026 1:54 PM

Siri Sahasra files nomination for ZPTC in Vizianagaram

సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాజకీయ తుపాను తీరం దాటేసింది.. గాలులు పెనుగాలులు.. సుడిగాలులు.. వడగళ్ల వానలు మరిలేవు అనుకున్న టీడీపీ శ్రేణులకు ఈసారి సరికొత్త వాయుగుండం రూపంలో ముప్పు పొంచిఉంది. కార్పొరేషన్‌లో పోటీ చేసేందుకు సాంకేతిక అడ్డంకులు రావడంతో మాజీ జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) కుమార్తె సిరిసహస్ర పోటీలో లేకుండా తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 

దీంతో టీడీపీ అభ్యర్థి అవనాపు భార్గవి పోటీలో నిలిచారు. ప్రచారం చేస్తున్నారు. దీంతో పోన్లే ఇక పదవులకు సిరిసహస్ర పోటీ రాలేరు.. ఏదైనా పదవి ఉంటే మనకే అని పాత టీడీపీ నేతలు ఆశిస్తూ వచ్చారు. అయితే, జెడ్పీటీసీ నామినేషన్ల చివరి రోజు శుక్రవారం సిరిసహస్ర అకస్మాత్తుగా స్క్రీన్‌ పై ప్రత్యక్షమై కొత్తవలస, తెర్లాం జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్‌ వేయడంతో టీడీపీ నాయకుల్లో కలవరం మొదలైంది. ఆమె నామినేషన్‌ వేయడంతో టీడీపీ జెడ్పీ చైర్మన్‌ ఆశావహుల్లో ఆందోళన మొదలైనా ఎక్కడా కిక్కురుమనలేని పరిస్థితి. 

నిన్న మొన్నటివరకు తాము ఎవరి మీదనైతే పోరాటం చేశామో ఇప్పుడు అదే వ్యక్తి కుమార్తె కోసం పనిచేయాల్సి వస్తుందా ఏమిటి అనే సందేహాలు మొదలయ్యాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు చిన్నశ్రీను  ప్రాబల్యాన్ని ప్రశి్నస్తూ విమర్శలు గుప్పించినవాళ్లంతా ఇప్పుడు కుక్కిన పేనుల్లా ఆయన వెంట ..చివరాఖరికి ఆయన కుమార్తె వెంట నడవాల్సి వస్తుందా అనే భయంతో.. గుబులుతో కాలం వెళ్లదీస్తున్నారు 

కంది పోతానేమో? 
గతంలో కొద్దిలో ఎంపీ టికెట్‌ మిస్సయింది అనే ప్రచారంలో ఉన్న మరో టీడీపీ నేత కంది చంద్రశేఖర్‌ ఈసారి భార్య రమాదేవిని డెంకాడ నుంచి జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్‌ వేయించారు. గెలిస్తే జెడ్పీ చైర్మన్‌ పదవి మా ఇంట్లోనే అనుకుంటూ ఊహాలోకంలో ఉన్న ఆయన కూడా సిరి సహస్ర నామినేషన్‌ విషయం తెలియగానే ఉలిక్కిపడుతున్నారు. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో అసలు అధికార పార్టీ అభ్యర్థులు గెలుస్తారో?లేదో తెలియడం లేదు. ఇంతలోనే సిరిసహస్ర రూపంలో వచ్చిన తుఫాన్‌కు భయపడుతున్నారు. చిత్రవిచిత్రమైన హావభావాలు పలికిస్తున్నారు.  

త్యాగమూర్తిని గుర్తించరా?  
మరోవైపు మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు కూడా 2019 నుంచి నెల్లిమర్ల టికెట్‌ కోసం ప్రయతి్నస్తూనే ఉన్నారు. సీనియర్‌ అనే ట్యాగ్‌లైన్‌ మీద 2019లో టికెట్‌ పతివాడ నారాయణస్వామి నాయుడు తన్నుకుపోవడంతో పోన్లే ఇప్పుడు తప్పింది కానీ తర్వాతæ టైం నాదే అనే ధీమాతో బంగార్రాజు పార్టీని మోస్తూ ఉన్నారు. 2024లో టికెట్‌ వస్తుందనే హామీ ఉన్నప్పటికీ కూటమి కోటాలో టికెట్‌ జనసేన అభ్యర్థి మాధవి లాక్కున్నారు. దీంతో చేతిలో చాక్లెట్‌ కాకెత్తుకుపోయిన పిల్లాడిలా చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. 

పోన్లే ఈ దెబ్బతో త్యాగరాజు అనే బిరుదైనా వచ్చిందంటూ సంతోషపడ్డారు. మరోవైపు రోజూ ఎమ్మెల్యే మాధవి చేతిలో అవమానాలు భరిస్తూ జెడ్పీ చైర్మన్‌ పదవికోసం వెయిట్‌ చేశారు. అనుకున్నట్లుగానే బీసీ మహిళ రిజర్వేషన్‌ కలిసిరావడంతో కూతురు చంద్ర కళను భోగాపురం నుంచి నామినేషన్‌ వేయించారు. త్యాగరాజు అనే బిరుదును గుర్తు చేస్తూ ఇప్పటికే లోకేశ్, చంద్రబాబులను కలిసి తన కోరికను చెప్పారు. అది అవుతుందో లేదో కానీ ఈలోపు చిన్నశ్రీను రూపంలో తనకు గండం ఎదురు రావడంతో మళ్లీ బిత్తరచూపులు చూస్తూ నిలబడ్డారు. నిన్నమొన్నటివరకు చిన్నశ్రీనును ఆకాశానికి ఎత్తేసి, కృష్ణుడు,రాముడు అంటూ కీర్తనలు చిడతలు వాయించిన బంగార్రాజు ఇప్పుడు ఆయన వల్లనే తన కుమార్తె పదవికి ముప్పు వస్తుందని ఊహించలేకపోయారు.  

కళా వరం  
ఊరకరారు మహానుభావులు అన్నట్లుగా చిన్నశ్రీను కుమార్తె జెడ్పీటీసీగా నామినేషన్‌ వేశారంటే కేవలం జెడ్పీటీసీగా ఉండేందుకు కాదని, అది తమ అవకాశాలకు గండి కొట్టడం తథ్యమన్న కలవరం సీనియర్‌ నేత చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకట్రావులో మొదలైందట. నలభయ్యేళ్లుగా రాజకీయం చేస్తున్న తన కెరీర్‌ ముగింపు దశకు వచ్చిందని భావిస్తున్న ఆయన ఇక మంత్రి పదవి రాదనుకున్నారో.. దక్కదని అనుకున్నారో కానీ తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడు రామ్‌మల్లిక్‌కు అప్పగించాలని భావించారు. ఈ నేపథ్యంలోనే బీసీ మహిళకు రిజర్వ్‌ అయిన జెడ్పీ చైర్మన్‌ పదవి తన కోడలు సంధ్యకు ఇవ్వాలని అధిష్టానం వద్ద ప్రపోజల్‌ పెట్టారు. ఆమెను గరివిడి నుంచి బరిలో దించారు. ఇప్పుడు ఆయన ఈ కొత్తమ్మాయి సిరిసహస్ర ఎంట్రీతో హడలిపోతున్నట్లు తెలుస్తోంది. తన కోడలికి రావాల్సిన అవకాశం చిన్నశ్రీను తన కూతురికోసం తన్నుకుపోతారేమో అని ఆందోళన ఆయనలో మొదలైంది.  

ఇదీ చదవండి: భర్తకు వ్యతిరేకంగా భార్య ప్రచారం!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement