సాక్షి, విశాఖ: వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌కు వాయుగుండం హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం సోమవారానికి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని పేర్కొంది. మచిలీపట్నం- విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తీరం దాటే సమయంలో విశాఖ నుంచి బాపట్ల వరకూ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, నెల్లూరు, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాయుగుండం నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు తీరం వద్దకు వెళ్లకూడదని హెచ్చరికల జారీ చేసింది.


