జనసేనను ‘చిత్తు’గా ఓడించాలంటూ..! | Controversial comments by Minister Narayana against Jana Sena | Sakshi
Sakshi News home page

జనసేనకు డిపాజిట్లు కూడా రాకూడదు.. !

Oct 24 2026 6:16 PM | Updated on Oct 24 2026 6:26 PM

Controversial comments by Minister Narayana against Jana Sena

నెల్లూరు:  నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాగంగా టీడీపీ-జనసేన మధ్య రగడ రాజుకుంది. ప్రధానంగా నెల్లూరు కార్పొరేషన్‌ ఆరవ డివిజన్‌ ఎన్నికలపై టీడీపీ-జనసేన మధ్య వార్‌ తీవ్ర స్థాయికి చేరింది. ఆరవ డివిజన్‌లో పోటీలో ఉన్న జనసేన అభ్యర్థిని ఓడించేందుకు టీడీపీ కంకణం కట్టుకుంది. దీనికి మంత్రి నారాయణ వ్యాఖ్యలే ఉదాహరణ.  ఆ డివిజన్‌లో జనసేనకు డిపాజిట్లు కూడా రాకూడదంటూ మంత్రి నారాయణ వ్యాఖ్యానించడంతో  ఆ రెండు పార్టీల్లో ఉన్న అసమ్మతి మరోసారి బయటకొచ్చింది.

కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ రెండు పార్టీల్లో స్థానిక ఎన్నికలకు సంబంధించి చాలా చోట్ల విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరు కార్పొరేషన్‌లో మంత్రి నారాయణ సాక్షిగా అది బహిర్గతం కావడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఆది నుంచి అక్కడ కొన్ని డివిజన్లకు సంబంధించి పొత్తు పొసగలేదు.  ఈ నేపథ్యంలో అన్ని చోట్ల పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. 

అయితే జనసేనతో పొత్తు పెట్టుకోకపోతే టీడీపీకి ఇబ్బంది ఉంటుందని గ్రహించిన నేతలు.. మళ్లీ పొత్తు ధర్మం అంటూ మ్యాజిక్‌ చేశారు. దీంతో నాలుగు డివిజన్లలో పోటీకి జనసేన అంగీకరించింది. ఈ క్రమంలోనే పోటీకి సిద్ధమవుతుండగా జనసేనకు అభ్యర్థే లేని ఏడవ డివిజన్ కేటాయించింది టీడీపీ. దీంతో రగడ మళ్లీ మొదటికొచ్చింది. 

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

టీడీపీని నమ్ముకుంటే ఇలాగే ఉంటుందని భావించిన జనసేన వర్గం.. టీడీపీ వైఖరిని నిరసిస్తూ ఆరవ డివిజన్‌లో పోటీకి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గానికి మంత్రి నారాయణ దిశా నిర్దేశం చేస్తూ.. ఆరవ డివిజన్‌లో జనసేనను ఓడించాలంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. అక్కడ జనసేనకు డిపాజిట్లు కూడా రాకూడదని, చిత్తుగా ఓడించాలని మంత్రి నారాయణ వ్యాఖ్యానించడం ఇప్పుడు ‘కూటమి’ లోమరింత వేడి పుట్టించింది. మంత్రి నారాయణ తీరుపై జనసేన మండిపడుతుంది. 

ఇదీ చదవండి: వారం రోజులుగా దాడులు కొనసాగుతున్నాయి: రాచమల్లు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement