వైఎస్సార్‌సీపీ నేతలను గృహ నిర్బంధం చేయడం దేనికి?: సజ్జల | Sajjla Ramakrishna Reddy on govt over AP local body elections | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతలను గృహ నిర్బంధం చేయడం దేనికి?: సజ్జల

Oct 24 2026 6:40 PM | Updated on Oct 24 2026 7:08 PM

Sajjla Ramakrishna Reddy on govt over AP local body elections

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ స్థానిక ఎన్నికల వేళ కూటమి సర్కారు తీరుపై వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. నిన్న (అక్టోబరు 23) వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాక్ష్యాలతో సహా మాట్లాడారని తెలిపారు.

శనివారం సజ్జల తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘బీసీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినీని నిర్బంధించారు. వైఎస్సార్‌సీపీ నేతలను గృహ నిర్బంధం చేయడం దేనికి? చంద్రబాబు ఒక్క ఆధారం కూడా లేకుండా అన్నీ అబద్ధాలే మాట్లాడారు. చంద్రబాబు తన పాలనను హైదరాబాద్‌ నుంచి నడుపుతున్నారు. స్క్రూటినీ పేరుతో అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తున్నారు.

చంద్రబాబు అబద్ధాలు వల్లె వేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ వాళ్లే దాడులు చేస్తున్నారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నామినేషన్లు వేసే వాళ్లు ఎందుకు దాడులు చేస్తారు? నామినేషన్లు దాఖలైన వాటిలో మావే ఎందుకు తక్కువగా ఉన్నాయి. టీడీపీ అరాచకాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తడి గుడ్డలతో గొంతు కోయడం చంద్రబాబుకు బాగా తెలుసు.

వైఎస్సార్‌సీపీ తరఫున టీడీపీ వాళ్లే నామినేషన్లు వేస్తున్నారు. నామినేషన‍్లు ఎవరి తరఫున ఎవరు వేస్తున్నారో కూడా తెలియడం లేదు. నామినేషన్లు వేసేందుకు మా నేతలు వీధి పోరాటం చేస్తున్నారు. నామినేషన్‌ సెంటర్‌ దగ్గర టీడీపీ నేతలు గుంపులు గుంపులుగా ఉంటారు. రాయలసీమ సంస్కృతి గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. నామినేషన్లు చించుతున్నా ఆర్వో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు’’ అని తెలిపారు. 

వ్యక్తిత్వ హననం చేస్తున్నారు..
చంద్రబాబుకు తమను ఎదుర్కొనే ధైర్యం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఎల్లో మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, అబద్ధాలకు మాత్రం చంద్రబాబు కట్టుబడి ఉంటారని చురకలంటించారు. అడ‍్డగోలుగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారని, తాము అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదన్నారు సజ్జల.

ఇదీ చదవండి: వారం రోజులుగా దాడులు కొనసాగుతున్నాయి: రాచమల్లు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement