
ఏడుకొండలవాడా.. దివ్యాంగులను కాపాడు
వేంకటేశ్వరస్వామి దివ్యాంగులను కాపాడాలని వేడుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం మాకొద్దు. ఓట్లు వేసి గెలిపిస్తే.. దివ్యాంగులను రోడ్లపై కుర్చోబెట్టారు. 4 గంటల పాటు ఎండలో ధర్నా చేసి పలువురు రోగులు నానా ఇబ్బందులు పడ్డారు. అయినా అధికారులకు కనికరం లేదు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై కక్షకట్టినట్లు భావిస్తున్నాం. న్యాయం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. – చంద్రశేఖర్, దివ్యాంగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు
దివ్యాంగుల జీవితాలు అంధకారం
అనేక ఆరోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్న దివ్యాంగుల జీవితాలను కూటమి ప్రభుత్వం అంధకారంలోకి నెట్టేస్తోంది. అయినా కనికరం లేకుండా ఫించన్లు తొలగించారు. మేమంతా ఏ పార్టీకి చెందినవాళ్లం కాదు. మా జీవనమే కష్టంగా ఉంది. ఏ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు ఇలా దివ్యాంగుల పింఛన్లు తొలగించలేదు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇలా చేయడం న్యాయం కాదు.
– మధులత, దివ్యాంగుల సేవా సమితి జిల్లా మహిళా అధ్యక్షురాలు

ఏడుకొండలవాడా.. దివ్యాంగులను కాపాడు