గుప్తనిధులు తవ్వకాల కేసులో ఏడుగురి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గుప్తనిధులు తవ్వకాల కేసులో ఏడుగురి అరెస్టు

Aug 22 2025 6:49 AM | Updated on Aug 22 2025 6:49 AM

గుప్త

గుప్తనిధులు తవ్వకాల కేసులో ఏడుగురి అరెస్టు

బుచ్చినాయుడుకండ్రిగ: పొలంలో గుప్తునిధుల కోసం తవ్వకాలు జరిపిన కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి, జేసీబీని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తిమ్మయ్య, ఎస్‌ఐ విశ్వనాథనాయుడు తెలిపారు. గురువారం స్థానిక పోలీసుస్టేషన్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. ఆలత్తూరు గ్రా మానికి చెందిన చిల్లకూరి ఉమామహేశ్వర్‌రెడ్డి బావమరిది ధనంజయరెడ్డికి 30 ఎకరాల పొలం ఉంది. ఈ పొలంలో పురాతన తులసీకోట ఉండ డంతో, తులసీకోట కింద నిధులున్నాయనే అను మానంతో ఈ నెల 18వ తేదీన కొందరు రాత్రి జేసీబీతో తవ్వకాలు జరిపారు. దీంతో స్థానిక పో లీసు స్టేషన్‌లో తవ్వకాలపై ఉమామహేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు రెడ్డిగుంటబాడవ గ్రామానికి చెందిన ఎ.గురవయ్య, బీ.గురవయ్య, ఓజిలి మండలం హరివరం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌, హరీష్‌, ఆశోక్‌, అనిల్‌, శేఖర్‌ను నిందితులుగా గుర్తించి, వారిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. తవ్వకానికి ఉపయోగించిన జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఎస్‌ఐ సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.

శ్రీరామలో ఘనంగా

ఓరియెంటేషన్‌ డే

తిరుపతి సిటీ:స్థానిక కరకంబాడి రోడ్డులోని శ్రీరా మ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో గురువారం మొదటి సంవత్సరం ఇంజినీరింగ్‌ కోర్సుల్లో అడ్మిషన్లు తీ సుకున్న విద్యార్థుల కోసం ఓరియెంటేషన్‌ డే ఘ నంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్‌ మన్నెం రా మిరెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులున్నాయని తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్య సాధనకు అధ్యాపకులు సహాయ సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. ఆధునాతన టెక్నాలజీని అందుపుచ్చుకుని ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేయాలని సూచించారు. ఇక్కడ విద్యనభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఐఐటీ ప్రొఫె సర్‌ వాసుదేవరావు, డైరెక్టర్‌ మన్నెం అరవింద్‌కుమార్‌రెడ్డి, సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జయచంద్ర, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నేడు సాంఘిక సంక్షేమశాఖ ప్రాంతీయ సదస్సు

తిరుపతి అర్బన్‌: రాయలసీమ జిల్లాల సాంఘిక సంక్షేమశాఖ అధికారులతో శుక్రవారం ప్రాంతీ య సదస్సు తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సమావేశం జరపనున్నారు. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించే రీజినల్‌ కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డో లా శ్రీబాల వీరంజనేయస్వామి పాల్గొననున్నా రు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన బైరాగిపట్టెడలోని నర్సింగ్‌ విద్యార్థులకు జర్మన్‌ భాష ఉచిత శిక్షణ ప్రారంభించనున్నారు.

గుప్తనిధులు తవ్వకాల కేసులో ఏడుగురి అరెస్టు 1
1/1

గుప్తనిధులు తవ్వకాల కేసులో ఏడుగురి అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement