
ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెసు్ట
తిరుపతి మంగళం : ప్రకాశం జిల్లా గిద్దలూరు ఫారెస్ట్ డివిజన్‌లో ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 26 ఎరచ్రందనం దుంగలు, ఒక మోటారు సైకిల్‌ను గురువారం తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ ఎండీ షరీఫ్ ఆధ్వర్యంలో కడప సబ్ కంట్రోల్ ఆర్‌ఎస్‌ఐ పీ.నరేష్ బృందం బుధవారం రాత్రి నుంచి ప్రకాశం జిల్లా గిద్దలూరు ఫారెస్ట్ రేంజ్‌లోని బెస్తవారిపేట అటవీ పరిధిలో కూంబింగ్ చేపట్టారు. వీరు గుంతపల్లి బీటుకు చేరుకునేసరికి అక్కడ ఒక మోటారు సైకిల్ వద్ద కొంతమంది వ్యక్తులు గుమికూడి కనిపించారు. వారిని సమీపించడంతో, పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ముగ్గురిని పట్టుకున్నారు. వారిని విచారించి, అక్కడే కల్వర్టు కింద దాచి ఉంచిన 26 ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు ప్రకాశం జిల్లా వాసులుగా గుర్తించారు. వారిని దుంగలతోపాటు మోటారు సైకిల్‌ను తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు హెడ్ కానిస్టేబుల్ సుబ్రమణ్యం రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎంఈఏ 2025 అసోసియేషన్ ప్రారంభం
తిరుపతి రూరల్: పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ అసోసియేషన్ (ఎంఈఏ) ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్ అకాసి దేవసహాయం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ పి.మల్లికార్జున, అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పి.స్నేహలత, ఉపాధ్యక్షురాలు పి.వింధ్య, కార్యదర్శి పి.హర్షిత, సహాయ కార్యదర్శులు ఎస్.రమ్యశ్రీ, ఇ.కీర్తి పాల్గొన్నారు.

ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెసు్ట