
ఎమ్మెల్సీ మేరిగను పరామర్శించిన సజ్జల
రాపూరు/సైదాపురం: ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తండ్రి మేరిగ ఆనందరావు ఇటీవల మృతి చెందిన విషయం విదితమే. ఈ క్రమంలో గురువారం వైఎస్సార్ సీపీకి చెందిన అగ్రనేతలు రాపూరులోని లక్ష్మీపురంలోని మేరిగ నివాసంలో మురళీధర్ తండ్రి ఆనందరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మురళీధర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే అక్రమ కేసులు, దౌర్జన్యాలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆరా తీశారు. అనంతరం మాజీ ఉప ముఖ్య మంత్రి నారాయణస్వామి, జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులు ఆనందరావు చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. మాజీ మంత్రి, జిల్లా కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరావు, ఎమ్మెల్సీపర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, జిల్లా నేత లు ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి కలిసి రాపూరుకు చేరుకు ని మురళీధర్‌ను పరామర్శించారు. కార్యక్రమంలో రాపూరు,సైదాపురం, బాలాయపల్లి, డక్కిలి మండలా లకు చెందిన పార్టీ కన్వీనర్లు మధుసూధన్‌రెడ్డి, ఎం.రవికుమార్‌యాదవ్, వెందోటి కార్తీక్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బత్తి న పట్టాభిరామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాపకన్ను మధుసూదన్‌రెడ్డి,మండల కన్వీనర్ బోడ్డు మధు సూదన్‌రెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి దందోలు లక్ష్మీనారాయణరెడ్డి,వలంటరీ విగ్ అధ్యక్షులు దుగ్గిరెడ్డి నరసింహరెడ్డి, నలమారు రామ్‌గోపాల్‌రెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు మోహన్‌రావు తదితరులున్నారు.

ఎమ్మెల్సీ మేరిగను పరామర్శించిన సజ్జల

ఎమ్మెల్సీ మేరిగను పరామర్శించిన సజ్జల