నిరీక్షణకు తెర | - | Sakshi
Sakshi News home page

నిరీక్షణకు తెర

Aug 21 2025 6:36 AM | Updated on Aug 21 2025 7:26 AM

శ్రీవారిమెట్టు నుంచి తిరుమలకు వెళ్లిన అభిమానులు

ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌

ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు

సింగిల్‌ మేజర్‌తోనే ప్రవేశాలు

ఈనెల 26 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు

జిల్లాలోని డిగ్రీ కళాశాలల సమాచారం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 17

ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 104

టీటీడీ డిగ్రీ కళాశాలు 5

విభాగాలు 21

అందుబాటులో ఉన్న

మొత్తం సీట్ల సంఖ్య 26,755

జిల్లాలో 126 కళాశాలలో అడ్మిషన్లు

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో ఎట్టకేలకు ప్రవేశాలకు ప్రారంభం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు నెట్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సుమా రు 126 డిగ్రీ కళాశాలల్లో 21 విభాగాలలో సింగిల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌తో దాదాపు 26,755 సీట్లు భర్తీకి ఉన్నత విద్యామండలి అనుమతించింది. అడ్మిషన్ల ప్రక్రియ దాదాపు నాలుగు నెలలు పాటు ఆలస్యం కావడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కనీసం 50శాతం ప్రవేశాల మార్కు దాటేనా అంటూ అంటూ ఆలోచనలో పడ్డాయి. ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గత ఏడాది 50 శాతం అడ్మిషన్లు సైతం కాకపోవడం ఈ ఏడాది 30శాతం ప్రవేశాలు జరిగేనా అంటూ ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.

తిరుపతి సిటీ : గత నాలుగు నెలలుగా డిగ్రీ ప్రవేశాల కోసం జిల్లాలో సుమారు 30 వేల మంది విద్యార్థుల నిరీక్షణకు ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంటర్‌ ఫలితాలు ఏప్రిల్‌ మాసంలో విడుదలైనా సింగిల్‌, డబుల్‌ మేజర్‌ అంటూ కమిటీని నియమించి కాలయాపన చేసి ఉన్నత విద్యామండలి బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌నే యూజీలో కొనసాగిస్తూ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. కాగా పీజీసెట్‌, లాసెట్‌, ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అందకపోవడంతో అడ్మిషన్లు ఎప్పుడు జరుగుతాయో అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

24 నుంచి వెబ్‌ ఆప్షన్లకు అవకాశం

డిగ్రీ ప్రవేశాలకు ఈనెల 26వ తేదీలోపు విద్యార్థులు ఆన్‌లైన్‌ అడ్మిషన్స్‌ మోడ్యుల్‌ ఫర్‌ డిగ్రీ కాలేజెస్‌ (ఓఏఎమ్‌డీసీ) వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ పద్ధతిలో తమకు అనుకూలమైన కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 24వ తేదీ నుంచి 28 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇచ్చిన ఉన్నత విద్యామండలి 29వ తేదీన వెబ్‌ ఆప్షన్ల మార్పునకు వెసులుబాటు కల్పించింది. 31వ తేదీన మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్ల కేటాయింపు చేయనున్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీన ఆయా కళాశాలలో సీట్లు సాధించిన విద్యార్థులు రిపోర్టు చేసి అదే రోజు తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది.

హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు

డిగ్రీలో ప్రవేశాల కోసం ఇప్పటికే ఆప్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల అప్లికేషన్లను ప్రత్యేక హెల్ప్‌లైన్‌ డెస్క్‌లను ఏర్పాటు చేసి ఆయా కళాశాలల అధ్యాపకులు ఆన్‌లైన్‌ చేయనున్నట్లు తెలిసింది. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే క్రమంలో సమస్యలు ఎదురైనా, తెలియకపోయినా సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోనే అవకాశం కల్పించారు.

చంద్రగిరి : ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టడంతో ఆయనకు త్వరగా బెయిల్‌ రావాలంటూ ఆయన అభిమానులు తిరుమల వెంకన్నకు మొక్కుకున్నారు. ఈ మేరకు మూడు రోజుల క్రితం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు హరిప్రసాద్‌ రెడ్డి ఆధ్వర్యంలో పీలేరు నుంచి తిరుమలకు పాదయాత్రను చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం వారిని పోలీసులు అక్రమంగా అడ్డుకుని, స్టేషన్‌లో నిర్భందించారు. రాత్రి వరకు స్టేషన్‌లోనే ఉంచుకుని ఆపై సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం బుధవారం ఉదయం హరిప్రసాద్‌ రెడ్డితో పాటు అభిమానులు శ్రీవారిమెట్టుకు చేరుకున్నారు. ముందుగా అక్కడి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి తిరుమలకు పాదయాత్రను కొనసాగించారు. తిరుమలకు చేరుకున్న వారు శ్రీవారిని దర్శించుకుని, తమ అభిమాన నేత ఎంపీ మిఽథున్‌ రెడ్డికి త్వరగా బెయిల్‌ మంజూరు కావాలని ప్రార్థించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తోందన్నారు. శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అక్రమంగా అడ్డుకుని, నిర్భదించడం దీనికి ఉదాహరణ అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

కాలినడకన తిరుమలకు చేరుకున్న హరిప్రసాద్‌ రెడ్డి బృందం

ప్రవేశాలకు గ్రీన్‌సిగ్నల్‌

టీటీడీ డిగ్రీ కళాశాలల వివరాలు

కళాశాల కళాశాల కోడ్‌ విభాగాలు మొత్తం సీట్లు

పద్మావతి డిగ్రీ కళాశాల 18195 21 1550

ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల 20132 20 1417

ఎస్‌జీఎస్‌ కళాశాల 17656 19 1068

ఎస్వీ ఓరియెంటల్‌ కళాశాల 20185 6 300

సికింద్రాబాద్‌ ఎస్వీవీవీఎస్‌ 25519 3 60

అటానమస్‌ హోదాలో రెండవ ఏడాది

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్పీడబ్ల్యూ, ఎస్‌జీఎస్‌, ఎస్వీ ఆర్ట్స్‌, ఓరియంటల్‌ డిగ్రీ కళాశాలల్లో బుధవారం నుంచి అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో పాటు సికింద్రాబాద్‌లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీవీవీఎస్‌ డిగ్రీ కళాశాలల్లో సైతం అడ్మిషన్లుకు రిజిస్ట్రేషన్‌ ప్రారంభించారు. ఎస్పీడబ్ల్యూ, ఎస్వీ ఆర్ట్స్‌, ఎస్‌జీఎస్‌ కళాశాలలు గత ఏడాది అటానమస్‌ హోదా పొందాయి. 2025–26 విద్యా సంవత్సరానికి ప్రస్తుతం అడ్మిషన్లు జరగనున్నాయి. టీటీడీ కళాశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉచిత భోజన వసతి కల్పించనున్నారు.

నిరీక్షణకు తెర1
1/2

నిరీక్షణకు తెర

నిరీక్షణకు తెర2
2/2

నిరీక్షణకు తెర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement