భరద్వాజ తీర్థంలో అసాంఘిక కార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

భరద్వాజ తీర్థంలో అసాంఘిక కార్యక్రమాలు

Nov 1 2024 9:09 AM | Updated on Nov 1 2024 9:45 AM

-

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న భరద్వాజ తీర్థంలో కొంతమంది యూట్యూబర్లు అశ్లీల నృత్యాలు చేస్తూ వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. భరద్వాజ తీర్థం భరద్వాజ మహర్షి తపస్సు చేసిన స్థలంగా ఖ్యాతి పొందింది. భక్తపరాయణుడైన శివయ్య సంవత్సరంలో ఒకరోజు తై అమావాస్యకు శ్రీకాళహస్తీశ్వరాలయం నుంచి సతీసమేతంగా భరద్వాజ తీర్థానికి వచ్చి అభిషేక పూజలు అందుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 

ప్రశాంతమైన ఈ స్థలంలో తరచూ అసాంఘిక కార్యక్రమాలు పెచ్చుమీరుతున్నారు. కొంతమంది యువకులు చెట్లకింద కూర్చుని మద్యం సేవిస్తున్నారు. దీనికితోడు ఇటీవల యూ ట్యూబర్లు అశ్లీల నృత్యాలను ఇక్కడ చిత్రీకరించి సోషల్‌మీడియాలో పోస్టు చేయడం విమర్శలకు తావిస్తోంది. 

సెక్యూరిటీ సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ గార్డులు సరిగా విధులు నిర్వర్తించకపోవడం వల్లే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా పెరిగాయని మండిపడుతున్నారు. మూడు నెలలుగా సెక్యూరిటీ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో వారు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు దీనిపై దృష్టిసారిస్తారో.. లేక ఆ శివుడికే వదిలేస్తారో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement