​​​​​​​అవ్వా పింఛన్‌ అందుతుందా? | - | Sakshi
Sakshi News home page

​​​​​​​అవ్వా పింఛన్‌ అందుతుందా?

Sep 6 2023 1:04 AM | Updated on Sep 6 2023 11:31 AM

వృద్ధురాలు పుల్లం పుత్తూరు సుబ్బమ్మతో మాట్లాడుతున్న నేదురుమల్లి   - Sakshi

వృద్ధురాలు పుల్లం పుత్తూరు సుబ్బమ్మతో మాట్లాడుతున్న నేదురుమల్లి

రాపూరు: అవ్వా పింఛన్‌ అందుతుందా? అని వైఎస్సార్‌ సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఓ వృద్ధురాలిని అడిగారు. ఇంటికే తెచ్చి ఇస్తున్నారు నాయనా.. అని పుల్లంపుత్తూరు సుబ్బమ్మ సమాధానమిచ్చింది. అలాగే ఆరోగ్య సిబ్బంది ఇంటికి వచ్చి చూస్తున్నారా? పరీక్షలు చేస్తున్నారా? అని అచ్చం సంజీవమ్మను అడగ్గా.. ఆరోగ్యసిబ్బంది ఇంటికే వచ్చి రక్తపరీక్షలు చేసి, మందులు ఇస్తున్నారు.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎటువంటి కష్టం లేకుండా చూస్తున్నారు. ఆయన్ను భగవంతుడు చల్లగా చూడాలి.. అని సమాధానమిచ్చారు. ఈ సంభాషణలు మంగళవారం పె నుబర్తిలో జరిగిన గడప గడపకు మన ప్రభు త్వం కార్యక్రమంలో చోటు చేసుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement