కొంప ముంచిన వర్షం | - | Sakshi
Sakshi News home page

కొంప ముంచిన వర్షం

Aug 12 2026 12:10 AM | Updated on Aug 12 2026 12:10 AM

రోడ్డుపై ఆగి ఉన్న మరో కారును

ఢీకొన్న లారీ

కారులోని తొమ్మిది మందికి గాయాలు

తప్పిన పెను ప్రమాదం

ఓజిలి: వర్షం కొంప ముంచింది. జాతీయ రహదారి రాజుపాళెం సమీపంలోని సన్‌సిటీ వద్ద రెండు బస్సులు ఢీకొని రోడ్డుపై నిలిచిపోయాయి. అదే సమయంలో తిరుమల నుంచి రంగారెడ్డి వెళ్తున్న కారును గుమ్మిడిపూండి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమదంలో కారులోని 9 మందికి, బస్సుల్లోని పలువురుకి గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. ఇంటర్‌సిటీ ఎస్‌మార్ట్‌ బస్సు చైన్నె నుంచి విజయవాడకు 34 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి చైన్నెలో బయలుదేరింది. అలాగే షాయామొలీ సూపర్‌ లగ్జరీ బస్సు కూడా చైన్నె నుంచి రాజమండ్రికి బయలుదేరింది. ఈ క్రమంలో ఓజిలి మండలం జాతీయ రహదారి సన్‌సిటీ వద్దకు వచ్చే సరికి జోరువాన కురుస్తోంది. ఈ వర్షంలో సన్‌సిటీ వద్ద రహదారి పక్కన బ్యాటరీ బస్సు ఒక్కటి చీకటిలో నిలిచి ఉంది. గమనించిన షాయామొలీ బస్సు డ్రైవర్‌ వేగం తగ్గించాడు. వెనుకనే వస్తున్న ఇంటర్‌సిటీ ఎస్‌మార్ట్‌ బస్సు డ్రైవర్‌ బాలకందస్వామి బస్సును అదుపు చేయలేక షాయామొలి బస్సును ఢీకొట్టాడు. రెండు బస్సులు రోడ్డుపై నిలిచిపోయాయి. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, బోడిఉప్పల్‌ ప్రాంతానికి చెందిన 11 మంది కారులో తిరుమల నుంచి తిరుగుప్రయాణమయ్యాము. రాజుపాళెం సమీపంలో నిలిపి ఉంచారు. ఈ క్రమంలో కృష్ణపట్నం పోర్టు నుంచి బొగ్గును తీసుకుని గుమ్ముడిపూండికి వెళ్లి అన్‌లోడ్డు చేసి తిరిగి వస్తున్న లారీ జోరువానలో కారు కనబడకపోవడంతో వెనుక నుంచి వేగంగా ఢీకొంది. దీంతో ముందున్న లారీ కిందకు కారు దూసుకెళ్లింది. కారులోని విఘ్నేష్‌, యాదగిరి, మచ్చగిరి, పద్మ, స్వాతి, వెంకటరమణకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సిబ్బంది గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండు బస్సుల్లోని పలువురికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు దర్యాప్తులో ఉంది.

జాతీయ రహదారిపై రెండు బస్సులు ఢీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement