తిరుపతి సిటీ: ప్రభుత్వ, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో పలు యూజీ కోర్సులలో ప్రవేశాలకు ఓఏఎమ్‌డీసీలో ఆన్‌లైన రిజిస్ట్రేషన్ గడువు మంగళవారంతో ముగిసింది. ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ కొనసాగనుంది. 26వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నారు. కాగా మరో మారు రిజిస్ట్రేషన్ గడువు పొడిగిస్తారా లేదా అనే విషయం బుధవారం తెలుస్తుందని కళాశాలల యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి.
కోళ్ల వ్యాను బోల్తా
చంద్రగిరి: ప్రమాదవశాత్తు కోళ్ల వ్యాను బోల్తా పడిన ఘటన సోమవారం అర్థరాత్రి తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారి భాకరాపేట కనుమలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. భాకరాపేట నుంచి తిరుపతికి వెళ్తున్న కోళ్ల వ్యాను కనుమలోని పెద్ద మలుపు వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోళ్లన్నీ రోడ్డుపై పడిపోయాయి. స్థానిక ప్రజలు, వాహనాదారులు రోడ్డుపై పడిన కోళ్లను తీసుకెళ్లడానికి పోటీపడ్డారు. పెద్ద పెద్ద సంచులు తీసుకుని, అందినకాడికి కోళ్లను ఎత్తుకెళ్లారు. అయితే స్థానికుల సహాయంతో లారీ డ్రైవరు వాహనాన్ని తరలించేశాడు.


