టైలరింగ్‌ నేర్చుకోవడానికి వెళ్లిన యువతి అదృశ్యం.. ముంబై వెళ్తున్నా అంటూ.. | Young Woman Missing From Amberpet, Hyderabad | Sakshi
Sakshi News home page

టైలరింగ్‌ నేర్చుకోవడానికి వెళ్లిన యువతి అదృశ్యం.. ముంబై వెళ్తున్నా అంటూ..

Dec 15 2022 7:39 AM | Updated on Dec 15 2022 7:39 AM

Young Woman Missing From Amberpet, Hyderabad - Sakshi

 షేక్‌ సనా 

సాక్షి, హైదరాబాద్‌: టైలరింగ్‌ నేర్చుకోవడానికి వెళ్తున్న ఓ యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన  బుధవారం అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మల్లేష్‌ కథనం ప్రకారం.. అంబర్‌పేట డివిజన్‌ పటేల్‌నగర్‌లో నివసించే షేక్‌ ఉన్నీసా కూతురు షేక్‌ సనా(19) ఉదయం 11 గంటలకు టైలరింగ్‌ నేర్చుకోవడానికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లింది.

అనంతరం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తల్లికి ఫోన్‌ చేసి తాను ముంబాయి వెళ్తున్నట్లు తల్లికి సమాచారం ఇచ్చి ఫోన్‌ స్విచాఫ్‌ చేసింది. దీంతో తల్లి ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: (Hyderabad: పాతబస్తీకి మెట్రో కలేనా..?)

Advertisement
 
Advertisement
Advertisement