breaking news
sana shaik
-
టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్లిన యువతి అదృశ్యం.. ముంబై వెళ్తున్నా అంటూ..
సాక్షి, హైదరాబాద్: టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్న ఓ యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన బుధవారం అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మల్లేష్ కథనం ప్రకారం.. అంబర్‌పేట డివిజన్ పటేల్‌నగర్‌లో నివసించే షేక్ ఉన్నీసా కూతురు షేక్ సనా(19) ఉదయం 11 గంటలకు టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లింది. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తల్లికి ఫోన్ చేసి తాను ముంబాయి వెళ్తున్నట్లు తల్లికి సమాచారం ఇచ్చి ఫోన్ స్విచాఫ్ చేసింది. దీంతో తల్లి ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: పాతబస్తీకి మెట్రో కలేనా..?) -
తెలుగు తెరపైకి కమల్ టబూల కూతురు!!
కమల్ హాసన్, టబు హీరో హీరోయిన్లుగా వచ్చిన 'చాచీ 420' చిత్రం గుర్తుంది కదూ. అందులో వాళ్ల కూతురిగా చేసిన చిన్నారి అప్పట్లోనే యాక్టింగ్ ఇరగదీసింది. ఆ సినిమా విడుదలై ఇప్పటికి దాదాపు 17 ఏళ్లు గడిచాయి. దాంతో అప్పటి చిన్నారి.. ఇప్పుడు నిండు జవ్వనిగా తెలుగు తెరమీదకు వచ్చేస్తోంది. 'నువ్వు నేను ఒక్కటవుదాం' అనే సినిమాతో తెరంగేట్రం చేయడానికి సనా షేక్ సిద్ధమైంది. బాలనటిగా తాను చాలా సినిమాల్లో చేశానని.. కమల్ హాసన్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అమ్రిష్ పురి, కాజోల్, అజయ్ దేవ్‌గణ్.. ఇలా అందరితో కలిసి నటించానని ఆమె చెప్పింది. భామనే సత్యభామనే సినిమా షూటింగులో అయితే కమల్ హాసన్ స్వయంగా తనకు తలదువ్వి జడ వేశారని, వాళ్లెవ్వరూ ఇప్పుడు తనను గుర్తుపట్టలేకపోవచ్చని సనా తెలిపింది. ముంబైలో పుట్టి పెరిగిన సనా షేక్ ఇంతకుముందు తహాన్, ఆకాశవాణి లాంటి చిత్రాల్లో ఇటీవల నటించింది. తెలుగువాళ్లంతా చాలా అభిమానంగా ఉంటారని, డైలాగులు సరిగా చెప్పలేక తిప్పలు పడుతున్నా చాలా సహనంతో తనను భరించారని చెప్పింది. తాను నటిని కాకపోతే ఫొటోగ్రఫీ నేర్చుకుని సినిమాటోగ్రాఫర్ అయ్యి ఉండేదాన్నని, అయితే.. నటన మాత్రం తన ప్రాణమని సనా తెలిపింది. ఇంటర్ తర్వాత చదువును అటకెక్కించేసినట్లు కూడా నిర్మొహమాటంగా చెప్పేసింది.