నస్పూర్/మందమర్రిరూరల్: మంచిర్యాల జిల్లా నస్పూర్ గేట్ వద్ద గతనెల 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రి మండలం పొ న్నారం గ్రామానికి చెందిన చింతకుంట్ల లక్ష్మి, వెంకటాపూర్‌కు చెందిన అగ్గు సౌందర్య, తొగరి సుమలత, కాసిపేట మండలం ధర్మరావుపేటకు చెందిన సోనీ మృతి చెందారు. తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన వెంకటాపూర్‌కు చెందిన దివ్యవాణి 29న మృతి చెందగా సల్లూరి అనూష (20) శనివారం మృతిచెందింది. దీంతో ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరు చేరుకుంది. తీవ్రంగా గాయపడిన నారుమళ్ల లక్ష్మి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతుండగా, ఆటోడ్రైవర్ ప్రశాంత్ శనివారం కరీంనగర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
పనికెళ్లిన మూడు రోజులకే ప్రమాదం
వెంకటాపూర్‌కు చెందిన మల్లేశ్–ప్రమీల దంపతులకు మణిరాజ్, అనూష ఉన్నారు. తండ్రి, కుమారుడు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటున్నారు. వాళ్లకు చేదోడువాదోడుగా అ నూష మంచిర్యాలలో నూతనంగా ఓ షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తున్నారని తెలుసుకుని మూ డురోజుల క్రితం నుంచి పనికి వెళ్తుంది. 28న పనికి వెళ్లేక్రమంలో ప్రమాదం జరుగగా మృత్యువుతో పోరాడి మృతిచెందింది. ఒకే గ్రామంలో నలుగురిమృతితో విషాదం అలుముకుంది.
పోరాడి ఓడిన అనూష
ప్రమాదంలో గాయపడిన అనూషను వైద్యులు మె రుగైన వైద్యం కో సం కరీంనగర్‌లో ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించా రు. కోమాలోకి వె ళ్లడం, మెదడులో బ్లడ్‌క్లాట్ కావడం, ఊపిరితిత్తుల్లోకి నీరు, బ్లడ్ చేరి శరీరమంతా ఇన్‌ఫెక్షన్ అయిందని రిపోర్ట్‌లో గుర్తించారు. చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు సీసీసీ నస్పూర్ ఎస్సై తహసినొద్దీన్ తెలిపారు. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.


