68 ప్రమాదాలు.. వందే భారత్‌ రైలు వైపు వెళ్లొద్దు! గేదెలకు విజ్ఞప్తి  | TSREDCO Chairman Satirical Comments On vande Bharat Train Accident | Sakshi
Sakshi News home page

68 ప్రమాదాలు.. వందే భారత్‌ రైలు వైపు వెళ్లొద్దు! గేదెలకు విజ్ఞప్తి 

Published Sun, Apr 9 2023 7:50 PM | Last Updated on Sun, Apr 9 2023 8:15 PM

TSREDCO Chairman Satirical Comments On vande Bharat Train Accident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనతో పాటు వందే భారత్‌ రైలు ప్రారంభోత్సవంపై టీఎస్‌ రెడ్కో చైర్మన్‌ వై. సతీష్‌ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. వందే భారత్‌ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటివరకు దాదాపు 68 ప్రమాదాలు జరిగాయని, గేదెలు, ఆవులను ఢీకొని వందే భారత్‌ రైళ్లు దెబ్బతిన్నాయని సతీష్‌రెడ్డి అన్నారు.

నాగోలులో ఆయన మాట్లాడుతూ, మోదీ  సికింద్రాబాద్‌ – తిరుపతి వందే భారత్‌ రైలును ప్రారంభిస్తున్నారని, దయచేసి అటువైపు వెళ్లొద్దు.. మీరు పొరపాటున తాకినా రైలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అసలే ఆ రైళ్లు చాలా వీక్‌గా ఉంటాయి’’ అని గేదెలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకే వందే భారత్‌ స్కీంను ప్రధానమంత్రి మోదీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు.  కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి, సతీష్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 
చదవండి: పట్టెడన్నం కోసం..ప్రాణాలే పణంగా!.. గత ఏడాదిలోనే 17 మంది మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement