డీఎస్పీ నివాసంలో ఏసీబీ సోదాలు.. 8 కోట్ల విల్లా, ఆస్తులు.. | Telangana Hyderabad ACB Officials Are Conducting Extensive Raids Over Disproportionate Assets Case | Sakshi
Sakshi News home page

డీఎస్పీ నివాసంలో ఏసీబీ సోదాలు.. 8 కోట్ల విల్లా, ఆస్తులు..

Jul 2 2026 9:57 AM | Updated on Jul 2 2026 11:14 AM

Telangana Hyderabad ACB Officials Are Conducting Extensive Raids

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఏసీబీ అధికారులు సోదాల అంశం చర్చనీయాంశంగా మారింది. తాజాగా పటాన్‌చెరువు డీఎస్పీ భీమ్ రెడ్డి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఏక కాలంలో హైదరాబాదుతో పాటు 20 చోట్ల తనిఖీలు చేపట్టారు. గురువారం తెల్లవారుజాము నుంచే సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. సోదాల్లో భాగంగా రూ.8 కోట్ల విలువైన విల్లాలు, భారీగా అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఏసీబీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement