కాటేదాన్‌లో.. అస్థి పంజరం కలకలం! | Skeleton Found On Katedan Old Kurnool Road In Hyderabad | Sakshi
Sakshi News home page

కాటేదాన్‌లో.. అస్థి పంజరం కలకలం!

Jun 13 2026 7:55 AM | Updated on Jun 13 2026 10:39 AM

Skeleton Found On Katedan Old Kurnool Road In Hyderabad

మైలార్‌దేవ్‌పల్లి: మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలోని కాటేదాన్‌ ఓల్డ్‌ కర్నూలు రోడ్డులో శుక్రవారం అస్థిపంజరం కలకలం సృష్టించింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది మ్యాన్‌హోల్స్‌ శుభ్రపరుస్తుండగా కుళ్లిపోయిన స్థితిలో అస్థి పంజరం కనిపించింది.

దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు  సమాచారం అందించడంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అస్థిపంజరాన్ని పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహం పురుషుడిదా, మహిళదా? అనే విషయం ఫోరెన్సిక్‌ పరీక్షలు, దర్యాప్తు తర్వాత తేలుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement