సాక్షి, జనగామ జిల్లా: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పై ఆగి ఉన్న ఇసుక లారీని ఆర్టీసీ రాజధాని బస్సు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు.
గాయపడిన వారిని ప్రభుతాసుపత్రికి తరలించారు. హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. మృతులను ఓం ప్రకాష్, నవదీప్ సింగ్‌గా గుర్తించారు. వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను వణికిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ట్రావెల్స్ బస్సులో పొగలు.. తప్పిన ప్రమాదం..
ఎన్టీఆర్ జిల్లాలో ప్రమాదం తప్పింది. కీసర టోల్‌గేట్ వద్ద ట్రావెల్స్ బస్సులో పొగలు రావడంతో కలకలం రేగింది. టోల్‌గేట్ సిబ్బంది అప్రమత్తతతో ప్రమాదం తప్పింది.


