RangaReddy: ఆర్డీవో ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. పోస్టల్‌ బ్యాలెట్‌కు నో సీల్‌! | Political Tension At Ibrahimpatnam RDO Office | Sakshi
Sakshi News home page

RangaReddy: ఆర్డీవో ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. పోస్టల్‌ బ్యాలెట్‌కు నో సీల్‌!

Dec 2 2023 9:17 PM | Updated on Dec 2 2023 9:20 PM

Political Tension At Ibrahimpatnam RDO Office - Sakshi

సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాయలం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నవంబర్‌ 29వ తేదీ నాటి పోస్టల్‌ బ్యాలెట్లను స్ట్రాంగ్‌ రూమ్‌కి అధికారులు పంపించకపోవడం కలకలం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ శ్రేణులు ఆర్డీవో ఆఫీసు వద్దకు భారీగా చేరుకుంటున్నారు. 

వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాయలం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నవంబర్‌ 29వ తేదీ నాటి పోస్టల్‌ బ్యాలెట్లను అధికారులు స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించలేదు. దీంతో, ఈ విషయంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, అక్కడ ఉద్రికత్త పరిస్థితి చోటుచేసుకుంది. అనంతరం, పోస్టల్‌ బ్యాలెట్‌ను అధికారులు స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. ఇక, పోస్టల్‌ బ్యాలెట్‌ను స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించిన తర్వాతే అధికారులు సీల్‌ వేశారు. పోలింగ్‌ జరిగి రెండు రోజులు దాటినా స్ట్రాంగ్‌ రూమ్‌కు తాళం లేకపోవడం పట్ల కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్ర అభ్యంతర​ం వ్యక్తం చేశారు. వెంటనే ఆర్డీవోను నిలదీశారు. 

Advertisement
 
Advertisement
Advertisement