సాక్షి,రంగారెడ్డి: శంకర్ పల్లి మండలం కొత్తపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బావిలో దూకి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దుర్ఘటనలో తల్లి వసంత (35) కూతురు నవ్య (15) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాల వల్లే కుటుంబం ఆత్మహత్య యత్నం చేసినట్లు భావిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.


