గూగుల్ పేలో ‘పాకెట్‌మనీ’ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ..! | pocketmoney link in google pay fraud alert | Sakshi
Sakshi News home page

గూగుల్ పేలో ‘పాకెట్‌మనీ’ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ..!

Apr 15 2026 1:30 PM | Updated on Apr 15 2026 1:41 PM

pocketmoney link in google pay fraud alert

పెద్దపల్లిరూరల్‌: సైబర్‌ నేరగాళ్లు సరికొత్త ఎత్తులు వేస్తూ అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నిత్యజీవితంలో డిజిటల్‌ చెల్లింపులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గూగుల్‌ పే ద్వారా చెల్లింపులు చేసేందుకు యాప్‌ ఓపెన్‌ చేయగానే తొలుత ‘పాకెట్‌మనీ’ అనే సింబల్‌ కనిపిస్తోంది. దానిని నొక్కితే బ్యాంకు ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతున్నాయట. డిజిటల్‌ పేమేంట్‌ చేసే వారంతా తమకు అవసరం లేనియాప్, లింకుల జోలికి వెళ్లక పోవడమే మంచిదని పోలీసు అధికారులు పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.   

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement