breaking news
Cybe Crime
-
సైబర్ సస్పెక్ట్.. వెంటనే రిపోర్ట్ చేయండి
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల నిరోధం దిశగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) మరో కీలక ముందడుగు వేసింది. అనుమానాస్పద సోషల్ మీడియా ఖాతా, ఫోన్ నంబర్.. ఇలా మొత్తం ఎనిమిది అంశాలపై ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసే అవకాశం ఇచి్చంది. దీనికోసం తన అధికారిక పోర్టల్‌లో (https:// cybercrime.gov.in) ప్రత్యేక విభాగంతో కూడిన లింక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ లింక్ దుర్వినియోగానికి ఆస్కారం లేకుండా ప్రతి ఫిర్యాదుతోపాటు ఆధారాలను జత చేయడం తప్పనిసరి చేసింది. సైబర్ నేరాలకు అవే ఆధారం ఏ సీజన్లో.. ఆ ఫ్రాడ్ చేస్తూ అందినకాడికి కొల్లగొట్టే సైబర్ నేరగాళ్లకు ఫోన్ కాల్స్‌తోపాటు సోషల్‌మీడియా ఖాతాలే ఆధారం. డార్క్ వెబ్‌తోపాటు వివిధ మార్గాల్లో లక్షల్లో ఫోన్‌నంబర్లను సంప్రదిస్తున్న సైబర్ నేరగాళ్లు వీటి ఆధారంగానే ఎర వేస్తున్నారు. బల్క్ విధానంలో సందేశాలు పంపుతూ, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్ఎస్) కాల్స్ చేస్తూ తమ పని ప్రారంభిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నకిలీ వెబ్సైట్లు ఏర్పాటు చేసి, వర్చువల్ మొబైల్ యాప్స్‌ను లింకుల ద్వారా టార్గెట్ చేసిన వ్యక్తికి పంపి అందినకాడికి దండుకుంటున్నారు. వీరు వినియోగించే సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు సహా ప్రతీదీ నకిలీ పేర్లు, చిరునామాలతోనే ఉంటున్నాయి. ఇప్పటి వరకు నేరం జరిగాకే... సైబర్ నేరాల బారిన పడినవారు ఫిర్యాదు చేయడానికి, సహాయసహకారాలు పొందడానికి ఎన్సీఆర్పీ పోర్టల్ పనిచేస్తోంది. ఈ వెబ్‌సైట్‌తో పాటు టోల్‌ఫ్రీ నంబరు1930 ద్వారా బాధితులు ఫిర్యాదు చేసే అవకాశముంది. ఇలా వచి్చన ఫిర్యాదుల ఆధారంగా నేరగాళ్లు వినియోగించిన సెల్‌నంబర్, బల్క్ పోర్టల్, వెబ్సైట్, బ్యాంకు ఖాతా సహా వివిధ అంశాలను పోర్టల్ నిర్వాహకులతోపాటు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) దృష్టికి వెళుతున్నాయి. ఇలా ఆయా నేరగాళ్లు వినియోగించిన వాటిని గుర్తిస్తున్న అధికారులు వాటిని కేసుల దర్యాప్తునకు ఆధారంగా మార్చుకుంటున్నారు. ఆపై వీటికి సంబంధించిన జాబితాలను రూపొందించి సంబంధిత విభాగాలు, మంత్రిత్వ శాఖలు, బ్యాంకుల ద్వారా బ్లాక్ చేయిస్తున్నారు. ఒకేసారి ఎందరినో టార్గెట్ చేస్తూ... ఇదంతా నేరం జరిగిన తర్వాత, ఆ నేరంలో కొందరు బాధితులుగా మారిన తర్వాత జరుగుతోంది. అలాకాకుండా సైబర్ నేరం చేయడానికి ముందే ఆ కేటుగాళ్లు ఎర వేయడం మొదలెట్టడంతోనే వీటిని బ్లాక్ చేయాలని ఎన్సీఆర్పీ నిర్ణయించుకుంది. ఓ వ్యక్తిని టార్గెట్ చేసిన తర్వాత నేరగాళ్లు కొన్నిరోజుల పాటు వారితో సంప్రదింపులు జరుపుతుంటాడు. వ్యవస్థీకృతంగా నేరం చేయడానికి కాల్ సెంటర్లు సైతం ఏర్పాటు చేసుకుంటున్న నేరగాళ్లు ఒకేసారి అనే క మందితో సంప్రదింపులు జరుపుతున్నారు.వీరిలో కొందరే వారి వల్లో పడతారు. ఆదిలోనే ప్రజల నుంచి సమాచారం సేకరించి వారి ఫోన్‌నంబర్ తదితరాలను బ్లాక్ చేస్తే బాధితుల సంఖ్య తగ్గే అవకాశముందని ఎన్సీఆర్పీ నిర్ణయించింది. దీంతో తన పోర్టల్‌లోని ‘రిపోర్ట్ అండ్ చెక్ సస్పెక్ట్’ ( https:// cybercrime.gov.in/webform/cyber&suspect.) విభాగంలో వెబ్సైట్, వాట్సాప్ నంబర్/టెలి గ్రాం హ్యాండ్లర్, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ, ఎస్ఎంఎస్ నంబర్/హ్యాండ్లర్, సోషల్‌మీడియా యూఆర్ఎల్, డీప్ ఫేక్, మొబైల్ యాప్‌లపై ఫిర్యాదు చేసే అవకాశం ఇచి్చంది. -
సరికొత్త సైబర్ మోసాలు!
ఇది టెక్నాలజీ కాలం.. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు ప్రతి పని సాంకేతికతతో ముడిపడి ఉంటోంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచమే మన గుప్పిట్లో ఉన్నట్టు..ఇదంతా నాణేనికి ఒక వైపు..సాంకేతికత ఎంతగా పెరిగిందో.. దాని వల్ల ముప్పు అంతే పొంచి ఉంటోంది. ముఖ్యంగా సాంకేతికత ఆధారంగా సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. కళ్లకు కనిపించని సైబర్ నేరగాళ్లు ఎక్కడో కూర్చుని ఇక్కడి మన బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. రోజుకో కొత్త తరహా మోసానికి తెరతీస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. 2024 ఒక్క ఏడాదిలోనే తెలంగాణ వాసుల నుంచి సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్ము రూ.1,866.9 కోట్లు అంటేనే ఈ తరహా మోసాల బారిన పడుతున్నవారు ఎంత పెద్ద సంఖ్యలో ఉంటున్నారో అర్థమవుతుంది. ఎంత విద్యాధికులైనా.. విజ్ఞానం ఉన్నా..అత్యాశ, అమాయకత్వం, అవగాహన లోపం లాంటి వాటితో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుపోతున్నారు.మరి ఇలాంటి వారినుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? సైబర్ నేరగాళ్లకు మన కష్టార్జితం చిక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న మోసాలు ఏంటి? నేరగాళ్లు ఎలా మోసం చేస్తున్నారు? ఇలా అనేక కోణాల్లో సైబర్ మోసాలపై పలువురు సైబర్ భద్రత నిపుణులు, పోలీస్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. విలువైన సూచనలు ఇస్తున్నారు. వీటిపై ‘సాక్షి’అందిస్తున్న ప్రత్యేక కథనం మీ కోసం.. – సాక్షి, హైదరాబాద్శ్రీధర్ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఉదయం 8 గంటల సమయంలో ఆయన ఫోన్‌కు వీడియో కాల్ వచ్చింది. పోలీస్ యూనిఫాంలో ఉన్న అవతలి వ్యక్తి.. మేం ముంబై పోలీస్...మీ బ్యాంకు ఖాతాల నుంచి విదేశాల్లోని సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాలకు డబ్బులు వెళ్లాయి. మీపై మనీలాండరింగ్ చట్టాల కింద కేసు నమోదైంది. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాం. మీరు ఇంకెవరితో ఫోన్లు మాట్లాడొద్దు..ఇంటినుంచి బయటికి వెళ్లొద్దు. అని బెదిరిస్తూనే చివరకు మిమ్మల్ని ఈ కేసు నుంచి బయటపడేయాలంటే, మేం చెప్పిన ఖాతాలో డబ్బులు వేయాలి..’అని చెప్పారు. ఆందోళనకు గురైన శ్రీధర్ మరో ఆలోచన లేకుండా వాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేశారు. అయితే పదేపదే డబ్బులు అడగడంతో ఇది సైబర్ మోసగాళ్ల పనై ఉంటుందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసం 1డిజిటల్ అరెస్టు డిజిటల్ అరెస్టు అనేది లేనేలేదు డిజిటల్ అరెస్టు... ఈ మధ్య కాలంలో ఎంతో ఎక్కువగా వింటున్న..జరుగుతున్న సైబర్ మోసం. ఫోన్ నంబర్, పూర్తి పేరు, అడ్రస్ ఇలా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఏదో ఒక రూపంలో సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు..అది వాడి మోసానికి తెర తీస్తున్నారు. మన ఫోన్లో ముంబై పోలీస్ అనో ఇతర పోలీస్ అనో రావడం, అవతలి వ్యక్తులు పోలీస్ యూనిఫాంలోనే ఉండడం.. మన పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ పక్కాగా చెబుతుండటంతో నిజమైన పోలీసులేనేమో అని భయపడేందుకు అవకాశం ఉంటోంది. నిజానికి డిజిటల్ అరెస్టు అన్నది లేనే లేదు. వారి మాటలు నమ్మితే.. నేరగాళ్లు అసలు కథ మొదలెడతారు. ఎలా మోసగిస్తారు..? : మనీలాండరింగ్ కేసులో మీపేరుంది.. మీ చిరునామా, ఆధార్, ఫోన్ నంబర్‌తో ఉన్న పార్శిల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. మీ బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లకు డబ్బులు పంపారు. మీ ఫోన్ నంబర్‌తో అనుమానితులకు ఫోన్లు వెళుతున్నాయి.. ఇలాంటివి చెబుతూ వీడియో కాల్స్ చేస్తారు. బెదిరిపోవద్దు..‘డిజిటల్ అరెస్టు సైబర్ మోసంలో.. నేరగాళ్లు మీపై ఏదో ఒక నేరారోపణ చేసి బెదరగొడతారు. మీ ఫోన్ నంబర్, మీ ఆధార్ నంబర్, మీ అడ్రస్ ఇలాంటి వివరాలు నేరంలో ఉన్నట్టు కంగారు పెడతారు. మనీలాండరింగ్, డ్రగ్స్ కేసు, కస్టమ్స్ కేసు, పోటా యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీ) కింద కేసు..లేదంటే మీపైన ఒక మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది..ఇలాంటి వాక్యాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. మీరు వెంటనే పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ ఒత్తిడిని క్రియేట్ చేస్తారు. ఆందోళన పెంచేందుకు ప్రయత్నిస్తారు. ఇతరులెవరికీ ఫోన్ చేయొద్దంటారు. మీరు మాట్లాడటం కొనసాగించే కొద్దీ ఇదేవిధంగా కంగారు పెడుతూ మెల్లగా ఈ నేరంలోంచి బయటపడేందుకు మీకు సహాయపడతామంటారు. నేరం నుంచి తప్పించుకోవాలన్నా..మీ పేరును ఈ నేరం నుంచి తొలగించాలన్నా..మేం అడిగినంత డబ్బులు పంపాలంటూ బేరాలు మొదలు పెడతారు. మీరు భయంతో అంగీకరిస్తే బ్యాంకు ఖాతాల నంబర్లు ఇస్తారు. వీలైనంతగా మీ వద్ద డబ్బు గుంజే ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి పోలీసులెవరూ ఇలా ఫోన్లలో బెదిరించరని, డిజిటల్ అరెస్టు అనేది లేనే లేదని తెలుసుకోవాలి. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి. మనకు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వస్తే సాధ్యమైనంతవరకు మాట్లాడకుండా ఉండటమే మంచిది..’అని సైబర్ భద్రత నిపుణుడు అద్వైత్ కంభం వివరించారు. ప్రణయ్.. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అతడి పీఐఐ వివరాలు థర్డ్‌పార్టీ నుంచి సేకరించే సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్ ప్రొఫైల్ నకిలీది క్రియేట్ చేసి..దాని ద్వారా ప్రణయ్ స్నేహితులు, బంధువులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపారు. కొద్దిరోజుల తర్వాత ప్రణయ్ నకిలీ ఫేస్బుక్ ఖాతా నుంచి ‘నా భార్య అనారోగ్యంతో ఉంది.అత్యవసర సర్జరీ కోసం ఆసుపత్రిలో చేర్పించాను. నా ఆన్లైన్ బ్యాకింగ్ పనిచేయడం లేదు. అర్జంట్‌గా నేను చెప్పిన నంబర్‌కు రూ.50 వేలు పంపించు. నేను సాయంత్రం వరకు తిరిగి ఇచ్చేస్తాను..’అంటూ ప్రణయ్ ఆఫీస్ కొలీగ్ నాగేందర్‌కు మెసేజ్ వచ్చింది. అత్యవసరంలో ఉన్నాడు కదా అని డబ్బులు పంపాడు. సాయంత్రం ప్రణయ్‌కు కాల్ చేస్తే కానీ నాగేందర్‌కు తెలియలేదు..అది ఫేక్ అని..మోసం2ఐడెంటిటీ థెఫ్ట్అంటే ఏమిటి..? పర్సనల్ ఐడెంటిఫయబుల్ ఇన్ఫర్మేషన్ (పీఐఐ) అంటే మన ఫోన్ నంబర్, పేరు, ఫొటోగ్రాఫ్, ఈ–మెయిల్..వీటి ద్వారా జరిగే మోసాలను ఐడెంటిటీ థెఫ్ట్ మోసాలుగా చెప్పవచ్చు. మన ఫొటోలను, లేదా వీడియోలను వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌తో మారి్ఫంగ్ ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేస్తారు. అవి నిజమైనవి కాదు అన్నది గుర్తుపట్టలేనంతగా చేస్తారు. వీటిని ఉపయోగించి సోషల్ మీడియా ఖాతాలు సృష్టించడం ద్వారా లేదంటే మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలతో మోసానికి తెరతీస్తారు. ఎలా మోసగిస్తారు..? మన వివరాలను వినియోగించి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు.. లేదా కొద్దిపాటి మార్పులతో మన ఈ–మెయిల్‌ను పోలినట్టుగా ఈ –మెయిల్స్ క్రియేట్ చేసి.. వాటిని వినియోగించి మోసాలకు పాల్పడతారు. నిజమైన వ్యక్తులే అవసరంలో ఉండి డబ్బులు అడుగుతున్నట్టుగా నమ్మిస్తారు. సామాన్యులు, ప్రముఖులూ బాధితులే..: ప్రసాద్ పాటిబండ్ల, సైబర్ భద్రత నిపుణుడు, ఢిల్లీఐడెంటిటీ థెఫ్ట్ సైబర్ మోసానికి ప్రముఖ రాజకీయ నాయకులు, కీలక అధికారులు, జడ్జీలు, ఇతర రంగాల సెలబ్రెటీలు ఎక్కువగా గురవుతున్నారు. మరోవైపు సామాన్యులకు సైతం ఈ ఐడెంటిటీ థెఫ్ట్ ముప్పు తప్పడం లేదు. ఉదాహరణకు.. మాజీ ఎంపీ సోయం బాపూరావు పేరిట గత ఐదేళ్లుగా గుర్తు తెలియని వ్యక్తి ‘ఎక్స్’ ఖాతాను రన్ చేస్తున్నాడు. ఒక అభ్యంతరకరమైన పోస్టు పెట్టిన తర్వాత ఆయన అప్రమత్తం అయి చూసుకుంటే తన పేరిట ‘ఎక్స్’ ఖాతా ఉన్నట్టు తెలిసింది. కొందరు ప్రభుత్వ అధికారులకు వారి పై అధికారుల పేరిట డబ్బులు పంపాలని వాట్సాప్‌లో, ఫేస్బుక్లో మెసేజ్ వచ్చిన సందర్భాలున్నాయి. ప్రొఫైల్ ఫొటో అధికారిదే ఉండడంతో చాలామంది డబ్బులు పంపి మోసపోయారు. ఇలా ఒక వ్యక్తి ఫొటో, పేరు, వివరాలు వాడి మోసగించడమూ ఐడెంటిటీ థెఫ్ట్ట్గా చెప్పొచ్చు. భవిష్యత్తులో ‘ఏఐ’ముప్పు..: ఇప్పుడు టార్గెటెడ్ వ్యక్తుల వీడియోలు ఏఐ టూల్స్ వాడి ఫేక్‌వి సృష్టిస్తున్నారు. ఇది భవిష్యత్తులో మరింత ముప్పు గా మారబోతోంది. వైరివర్గాన్ని దెబ్బతీసేలా వదంతులు క్రియేట్ చేసేందుకు కూడా ఈ ఐడెంటిటీ థెఫ్ట్ను వాడే అవకాశం ఉంది. కొద్దిపాటి మార్పులతో ఫేక్ ఈ–మెయిల్ అడ్రస్‌లు క్రియేట్ చేసి వాటి ద్వారా మోసాలు వ్యాపార రంగంలో జరుగుతున్నాయి. ఐడెంటిటీ థెఫ్ట్ బారినపడకుండా ఉండాలంటే మన వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా యా ప్స్‌లో వీలైనంత తక్కువగా ఉపయోగించడం ఉత్తమం. సోషల్ మీడియా యాప్స్‌లో మన వివరాలు, ఫొటోలకు ప్రొఫైల్ లాక్స్ పెట్టుకోవాలి. అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు అంగీకరించవద్దు.మోసం 3స్టాక్స్‌లో పెట్టుబడులు శ్రీనివాస్ ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగి. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతుండగా..తన వాట్సాప్‌కు ఒక మెసేజ్ వచ్చింది. అందులో స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన సమాచారం ఉంది. ఆ మెసేజ్లోని లింక్ ద్వారా ఆ వాట్సాప్ గ్రూప్‌లో చేరాడు. అందులో స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై సభ్యుల చర్చను వారం పాటు గమనించాడు.ఆ తర్వాత శ్రీనివాస్ సైతం కొద్ది మొత్తాల్లో పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టాడు. మొదట పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నట్టుగా యాప్‌లో చూపారు. ఇలా తన పెట్టుబడి రూ.50 లక్షలకు చేరిన తర్వాత డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే రాకపోవడంతో మోసమని గుర్తించి సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశాడు.ఎక్కువగా జరుగుతున్న మోసం ఇటీవల కాలంలో అత్యంత ఎక్కువగా జరుగుతున్న సైబర్ మోసాల్లో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఒకటి (స్టాక్స్‌లో పెట్టుబడుల పేరిట మోసం). సోషల్ మీడియాలో ఇచ్చే ప్రకటనల్లో స్టాక్ మార్కెట్లో పేరున్న సంస్థల్లా నమ్మకాన్ని నెలకొల్పుతారు. తక్కువ రిస్క్ తో అధిక రాబడులు వస్తున్నట్టుగా నకిలీ యాప్‌లో మనకు చూపుతుంటారు.పెట్టుబడి తక్కువ సమయంలోనే రెండింతలు, మూడింతలు అవుతున్నట్టుగా అంకెల్లో మార్పులు చేస్తూ నకిలీ లేదా థర్డ్‌పార్టీ యాప్‌లలోకి డబ్బును మళ్లిస్తారు. ఆ డబ్బును సైబర్ దొంగలు వాళ్ల బ్యాంకు ఖాతాల్లోకి తరలించుకుంటారు.మోసం4పార్ట్‌టైం ఉద్యోగాలు హర్షిణి గృహిణి..ఇద్దరు పిల్లలు. బీటెక్ పూర్తయిన తర్వాత ఉద్యోగం చేయాలనుకున్నా కుటుంబ బాధ్యతలతో చేయలేకపోయింది. ఓ రోజు ‘ఇంటివద్దే ఉంటూ పార్ట్‌టైం జాబ్‌తో నెలకు వేలల్లో సంపాదించండి..అంటూ ఫేస్బుక్లో ఒక యాడ్ చూసింది. అందులోని నంబర్లకు ఫోన్ చేసి, వారు అడిగిన వివరాలన్నీ ఇచ్చింది. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలకు లైక్‌లు కొట్టడం, షేర్ చేయడం వంటి టాస్్కలు ఇచ్చారు.కొద్దిరోజులపాటు డబ్బులు తన అకౌంట్లో జమ అవడంతో నమ్మకం పెరిగింది. కొద్ది రోజుల తర్వాత స్టాక్మార్కెట్లో మేం చెప్పిన యాప్స్‌లో పెట్టుబడులతో పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని ఆశపెట్టారు. ఆ మాటలు నమ్మిన హర్షిణి తన సంపాదనతోపాటు కుటుంబ సభ్యులకు చెందిన డబ్బులు పెట్టుబడిగా పెట్టి దాదాపు రూ.25 లక్షల వరకు మోసపోయింది. ఇంటర్వ్యూలు, డాక్యుమెంట్లు లేకుండా ఎలా? ఎలాంటి ఇంటర్వ్యూలు, డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన పని లేకుండా ఇంట్లో కూర్చుని కూడా రోజుకు వేలల్లో సంపాదించుకోవచ్చంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ‘ఎక్స్’ వాట్సాప్‌లలో నౌకరీ, షర్, మాన్స్టర్ వంటి వెబ్సైట్ల పేరిట నకిలీ ప్రకటనలతో ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగులు, గృహిణులు, తాత్కాలిక ఉద్యోగాలు ఉండి అదనపు సంపాదన కోసం ప్రయత్నించే వారిని టార్గెట్ చేస్తున్నారు. తొలుత పార్ట్‌టైం జాబ్స్‌తో మొదలుపెట్టి నెమ్మదిగా పెట్టుబడులు పెట్టేలా ఒత్తిడి చేస్తారు. తర్వాత మోసానికి తెరతీస్తారు. నిజమా.. కాదా.. అన్నది నిర్ధారించుకోవాలి ఇంటి దగ్గర ఉండే సంపాదించుకోవచ్చన్న ఆశతో కొందరు వీటిబారిన పడుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్.. ఇలా సోషల్ మీడియా వేదికల ద్వారా సైబర్ నేరగాళ్లు ఈ తరహా ప్రకటనలు ఇస్తున్నారు. మొదట రూ.10 వేలు, రూ.20 వేలు పెట్టుబడి పెట్టించి దాన్ని రెట్టింపు అయినట్టు చూపిస్తారు. ఈ లాభాలు డ్రా చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత ఇంకా లాభాలు వస్తాయి..రూ. లక్షల్లో పెట్టండి అని ప్రోత్సహిస్తారు..ఇలా మెల్లగా అవతలి వ్యక్తి ఎంత పెట్టుబడి పెట్టగలడో అంతా అయ్యే వరకు ఇలానే ప్రోత్సహిస్తారు.ఎప్పుడైతే అవతలి వ్యక్తి డబ్బులు విత్‌డ్రాకు ట్రై చేస్తారో అప్పుడు అసలు మోసం బయటపడుతుంది. అప్పటికే మనం పెట్టిన డబ్బులు సైబర్ నేరగాళ్లు ఇతర ఖాతాల్లోకి మళ్లించి అక్కడి నుంచి డ్రా చేసుకోవడం లేదా..క్రిప్టోకరెన్సీ రూపంలో విదేశీ ఖాతాల్లోకి మళ్లించడం చేసేస్తారు. ఈ మోసాలబారిన పడకుండా ఉండాలంటే సోషల్ మీడియా యాప్స్‌లో వచ్చే పార్ట్ టైం జాబ్స్ ప్రకటనలు నమ్మకూడదు. అవకాశం ఉంటే వ్యక్తిగతంగా వాళ్లు చెబుతున్న అడ్రస్‌కు వెళ్లి నిజంగానే ఆ ఆఫీస్ ఉందా..? లేదా...? నిర్ధారించుకున్న తర్వాతే అందులో చేరాలి. – కవిత, డీసీపీ, సైబర్ క్రైం, హైదరాబాద్ సిటీమోసం5ఫేక్ కస్టమర్ కేర్, అడ్వరై్టజ్‌మెంట్ ఫ్రాడ్స్ దిలీప్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. శామీర్‌పేట్‌లో ఉంటారు. ఇంట్లోని ఏసీ పనిచేయకపోవడంతో కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయాలనుకున్నారు. వెంటనే గూగుల్లోకి వెళ్లి సదరు కంపెనీ పేరుతో కస్టమర్ కేర్ నంబర్ అని గూగుల్ సెర్చ్ చేశారు. దానిలో వచ్చిన నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. అవతలి వ్యక్తి ‘మీకు కల్గిన అసౌకర్యానికి చింతిస్తున్నాం సార్..మీ ఇంటికి టెక్నీషియన్‌ను పంపుతాం. మీ ఇంటి అడ్రస్, ఇతర వివరాలు ఇవ్వండి. మీ మొబైల్‌కు ఒక మెసేజ్ వచ్చింది. అందులోని వెబ్‌లింక్ ఓపెన్ చేయండి. తర్వాత మీకు వచ్చిన ఓటీపీ చెబితే..మీ సర్వీసింగ్ రిక్వెస్ట్ కన్ఫర్మేషన్ అవుతుంది..’అని ఎంతో మర్యాదగా చెప్పింది. ఆమె చెప్పినట్టే చేశారు దిలీప్. కాసేపటికి అతడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతున్నట్టు మెసేజ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మోసం ఎలా ఉంటుంది?..: ఆన్లైన్లో ఫుడ్ఆర్డర్ అయినా..? క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించిన సమస్యలైనా..? ఇలా ఏ అవసరం అయినా వెంటనే కస్టమర్ కేర్‌కు లేదంటే ఆ సంస్థకు కాల్ చేసి ఫిర్యాదు చేయడం సహజం. సరిగ్గా ఇదే తమకు అనుకూలంగా మల్చుకుని సైబర్ మోసాలకు తెరతీస్తున్నారు. గూగుల్ సెర్చ్‌లు వద్దు ‘సైబర్ నేరగాళ్లు నిజమైన సంస్థల పేర్లతో నకిలీ వెబ్ పేజీలను క్రియేట్ చేస్తున్నారు. ఎస్ఈఓ (సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్)టెక్నిక్‌లు వాడి సైబర్ నేరగాళ్ల వెబ్పేజీనే ముందు మనకు కనబడేలా చేస్తున్నారు. అందులోని నంబర్‌కు మనం కాల్ చేస్తే నిజంగా ఆ సంస్థ ప్రతినిధిలా మాట్లాడుతూ, మన బ్యాంకు వివరాలు తీసుకోవడంతోపాటు ఓటీపీలు సైతం చెప్పించుకుని మోసాలకు పాల్పడతారు. అందుకే, కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్‌లో, యూ ట్యూబ్‌లో వెతకడం శ్రేయస్కరం కాదు. మీకు కావాల్సిన సంస్థ అధికారిక వెబ్సైట్లోకి, యాప్‌లోకి వెళ్లి మాత్రమే నంబర్లను తీసుకోవాలి..’అని సైబర్ భద్రత నిపుణులు నల్లమోతు శ్రీధర్ వివరించారు. అత్యాశతోనే అనర్థాలు.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న అత్యాశతో చాలా మంది ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ బారిన పడుతున్నారు. పెట్టుబడి పెట్టేముందు అ సంస్థ నిజమైనదేనా..? అన్నది తప్పకుండా ధ్రువీకరించుకోవాలి. అత్యధిక లాభాలంటూ వాస్తవ విరుద్ధంగా ఇచ్చే హామీలు ఉంటే తప్పకుండా అనుమానించాలి. తొందరపెట్టినా, ఆఫర్ చేజారిపోతుందని కంగారు పెట్టినా నమ్మవద్దు. అవసరమైతే మీకు తెలిసిన వారి నుంచి సలహాలు తీసుకోవాలి. అప్పటికే ఇన్వెస్ట్ చేస్తున్న వారి సూచనలు తీసుకోవాలి. ఒకవేళ మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. లేదా స్థానిక సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. – శ్రీబాల, డీసీపీ, సైబర్ క్రైమ్స్, సైబరాబాద్అప్రమత్తంగా ఉండండిసైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తరఫున ప్రజలను కోరుతున్నాం. ఆన్లైన్లో వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని పంచుకునే ప్రతిసారీ జాగ్రత్తగా ఉండండి. అనుమానాస్పద వెబ్ లింక్‌లపై క్లిక్ చేయవద్దు. నిర్ధారించుకోకుండా డబ్బులు ఎవరికీ పంపవద్దు. మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే టీజీసీఎస్బీ హెల్ప్‌లైన్ 1930 లేదా cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి. – శిఖా గోయల్, డైరెక్టర్, టీజీసీఎస్బీమరికొన్ని రకాల సైబర్ మోసాలు..ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్..ఆరోగ్యశ్రీ, ఫేక్ ఇన్సూరెన్స్ పేరిట గేమింగ్ ఫ్రాడ్స్..ఆన్లైన్ గేమింగ్, కలర్ కోడింగ్ ఆన్లైన్ రమ్మీ, స్పిన్నింగ్ వీల్ పేరిట సైబర్‌మోసం. లాటరీ ఫ్రాడ్స్..ఆన్లైన్లో లాటరీ వచ్చిందని, మీ పేరిట భారీ డిస్కౌంట్ ఆఫర్ అంటూ.. మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్..మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో నకిలీ ప్రొఫైల్స్ పెట్టి మోసం..సెల్ టవర్ ఇన్స్టాలేషన్ ఫ్రాడ్..మీ ఇంటి పరిధిలో సెల్ టవర్ ఇన్స్టాల్ చేసేందుకు ఆఫర్ ఉందని చెబుతారు. ఐవీఆర్ కాల్స్‌తో మోసం: మీరు అనుమానాస్పద నంబర్లకు ఫోన్లు చేశారని, మీ సిమ్‌కార్డు కొద్ది సమయంలోనే బ్లాక్ అవబోతుందని, ట్రాయ్, టెలికమ్ సర్వీస్ ప్రొవైడర్ల పేరిట ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) కాల్స్‌చేసి బెదిరించి మోసాలు.. కేవైసీ అప్డేషన్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఆధార్‌తో లింకేజీ చేయడం, కార్డు యాక్టివేషన్, కార్డు లిమిట్ పెంచడం, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు, రివార్డు పాయింట్లు డబ్బుగా మార్చుకోవాలని.. ఇలాంటి అంశాలతో మోసగిస్తారు. ఓఎల్ఎక్స్లో వస్తువులు అమ్ముతామని, లేదంటే కొంటామని నకిలీ అడ్రస్‌లు, ప్రూఫ్‌లతో మోసగిస్తారు.ఫోన్ నంబర్ ఇవ్వడమే తప్పు సాధారణంగా దొంగలు ఇంట్లోకి రాకుండా పెద్ద, పెద్ద తాళాలు వేస్తాం.. ఇంటికి నాలుగు మూలల సీసీటీవీ కెమెరాలు పెట్టుకుంటాం..అవసరమైతే కుక్కలను పెంచుకుంటాం. కానీ, కనిపించని సైబర్ దొంగల చేతికి మాత్రం ‘సమాచారం’అనే తాళాలు మనమే ఇస్తున్నాం. మందుల దుకాణం, సూపర్ మార్కెట్, మాల్స్, వస్త్ర దుకాణాలు, ఫుడ్‌కోర్టులు ఇలా ఎక్కడపడితే అక్కడ అవసరానికి మించి మన ఫోన్ నంబర్‌ను ఇస్తున్నాం. కొన్నిసార్లు అనివార్యంగా కూడా మన వివరాలు ఇవ్వక తప్పడం లేదు. ఇదే పెద్ద తప్పు అని గుర్తించాలంటున్నారు సైబర్ భద్రత నిపుణులు. ఇలా మనం ఇచ్చే సమాచారాన్ని కొన్ని సంస్థలు కాల్ సెంటర్లకు, థర్డ్‌పార్టీకి అమ్ముతున్నాయని మరవొద్దు. మన ఫోన్ నంబర్, పేరు తెలిస్తే మిగిలిన వివరాలు కనిపెట్టడం సైబర్ నేరగాళ్లకు పెద్ద కష్టమేమీ కాదు.. సులువుగా డబ్బులు సంపాదించాలనుకునే ప్రజల అత్యాశనే సైబర్ నేరగాళ్లు తమ ఆయుధంగా మార్చుకుంటున్నారు.గుడ్డిగా నమ్మొద్దు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని, మీకు ఫలానా బ్యాంకు నుంచి ఆఫర్ ఉందని, మీకు లాటరీలు వచ్చాయని..ఇలా ఏదో ఒక సాకుతో వచ్చే ఎస్ఎంఎస్లు, ఈ–మెయిల్స్‌లోని వెబ్ లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. అప్రమత్తతే ఆయుధం అన్నది మరవొద్దు. సైబర్‌మోసగాళ్లు ఇచ్చే మోసపూరిత ప్రకటనలు, మెసేజ్‌లు, ఈ మెయిల్స్‌ను గుడ్డిగా నమ్మకుండా.. ఆలోచించి, నిర్ధారించుకోవాలి. -
సైబర్ నేరాలపై వినూత్నంగా అవగాహన
దేశంలో సైబర్ నేరాలు అంతకంతకూ పెరుగుతుండడంతో టెలికం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కాలర్ ట్యూన్స్ ద్వారా సైబర్ నేరాలపట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని నడుం బిగించింది. ఈ మేరకు టెలికం కంపెనీలకు ఆదేశాలు వెలువరించింది. ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని టెల్కోలను ఆదేశించింది.హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్‌క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ ఈ కాలర్ ట్యూన్స్‌ను టెలికం కంపెనీలకు అందిస్తుంది. టెలికం కంపెనీలు మొబైల్ కస్టమర్లకు ప్రతిరోజు 8–10 కాల్స్‌కు ఈ సందేశాన్ని వినిపిస్తాయి. ప్రతి వారం కాలర్ ట్యూన్‌ను మారుస్తారు. ఇలా మూడు నెలలపాటు కాలర్ ట్యూన్స్ ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొన్ని కాల్స్ భారత్‌లో నుంచే వచ్చినట్లు కనిపిస్తాయి. వాస్తవానికి అందులో చాలా వరకు అంతర్జాతీయ స్పూఫ్డ్ ఇన్కమింగ్ కాల్స్ ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటిని వెంటనే గుర్తించి బ్లాక్ చేసే వ్యవస్థను కేంద్రం, అలాగే టెలికం సర్వీస్ ప్రొవైడర్లు రూపొందించారు.ఇదీ చదవండి: ‘భారత్ మార్కెట్‌కు కట్టుబడి ఉన్నాం’ఇటీవల నకిలీ డిజిటల్ అరెస్టులు, ఫెడెక్స్ స్కామ్‌లు, ప్రభుత్వం, పోలీసు అధికారులుగా నటించడం మొదలైన కేసులలో సైబర్ నేరస్థులు ఇటువంటి అంతర్జాతీయ స్పూఫ్డ్ కాల్స్ చేసినట్టు ప్రభుత్వం గుర్తించింది. 2024 నవంబర్ 15 వరకు 6.69 లక్షలకు పైగా సిమ్ కార్డ్‌లు, 1,32,000 ఐఎంఈఐలను కేంద్రం బ్లాక్ చేసింది. -
‘గోల్డెన్ అవర్‘ను మరవద్దు
⇒ నాచారంలో ఉండే హర్‡్ష అనే వ్యక్తి ఈ ఏడాది ఏప్రిల్ 27న సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు భయపడి మూడు దఫాల్లో రూ.కోటి 10 లక్షలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాలకు పంపారు. తాను మోసపోయినట్టు గ్రహించిన వెంటనే సైబర్ క్రైం హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ (సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోరి్టంగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టం) పోర్టల్‌లో వివరాలు అప్డేట్ చేశారు. కేవలం 12 నిమిషాల వ్యవధిలోనే రూ.కోటిని హోల్డ్ చేశారు. పెద్దమొత్తంలో డబ్బు లు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఆపగలిగారు. – సాక్షి, హైదరాబాద్‘‘గోల్డెన్ అవర్..’’సాధారణంగా ఈ పదం వైద్యం విషయంలో ఎక్కువగా వింటుంటాం. ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటలో రోగికి అందే చికిత్స అనేది వారి ప్రాణాన్ని కాపాడడంలో కీలకం. అదే మా దిరిగా సైబర్‌నేరం జరిగిన తర్వాత కూడా వెనువెంటనే పోలీస్ దృష్టికి తీసుకెళ్లడం వల్ల సొమ్ము సైబర్ నేరగాళ్లకు చేరకుండా కాపాడవచ్చని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. డబ్బు పోగొ ట్టుకున్న తర్వాత వెనువెంటనే సైబర్ క్రైం పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ 1930 నంబర్‌కు సమాచారం ఇవ్వడంతో తగిన పరిష్కా రం దక్కుతుందని వారు సూచిస్తున్నారు. అదేవిధంగా సైబర్ క్రైం పోర్టల్లోనూ ఫిర్యాదు చేయవచ్చని చెబుతున్నారు.కంగారు వద్దు.. 1930కు డయల్ చేయండి సైబర్ నేరగాళ్ల చేతిలో వివిధ రూపాల్లో మోసపోతున్న బాధితులు తమ బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు కట్ కాగానే ఎంతో కంగారు పడుతుంటా రు. ఈ కంగారులో వారు వెంటనే బ్యాంకులకు పరుగెత్తుతున్నారు. బ్యాంకు అధికారులు ఈ విషయం పోలీసులకు చెప్పాలనడంతో అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళుతున్నారు. అక్కడ పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడం.. పోగోట్టుకున్న డబ్బు మొత్తాన్ని బట్టి ఆ కేసు ఎవరి పరిధిలోకి వస్తుందన్న వివరాలు సేకరించేటప్పటికే ఎంతో సమయం వృథా అవుతోంది.సైబర్ నేరగాళ్లు గురి చూసి మరీ సెలవులు, వారాంతాల్లోనే ఎక్కువ కొల్లగొడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో అయితే విషయం పోలీసుల వరకు వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. కానీ, ఇన్ని ప్రయాసలు, అనవసర కంగారు పక్కన పెట్టి.. వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ఉత్తమమని సైబర్‌సెక్యూరిటీ బ్యూరో అధికారులు సూచిస్తున్నారు.24 గంటల పాటు అందుబాటులో ఉండే సిబ్బంది.. వెనువెంటనేడబ్బును కాపాడేందుకు చర్యలు తీసుకుంటారని వారు చెబుతున్నారు. అదేవిధంగా కొన్ని సార్లు నంబర్ వెంట నే కలవకపోతే నేరుగా సైబర్ క్రైం పోర్టల్ https:// cybercrime.gov.in లోనూ ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయడంతోనూ ఫలితం ఉంటుందని పేర్కొంటున్నారు.⇒ ఈ ఏడాది మే 14న ‘మేం మహారాష్ట్ర పోలీస్ శాఖ నుంచి మాట్లాడుతున్నాం.. మీపై పెద్ద మనీలాండరింగ్ కేసు నమోదైంది. వెంటనే మేం చెప్పినట్టు డబ్బులు పంపకపోతే మీపై కేసు నమో దు చేస్తాం..’’అని సైబరాబాద్‌లోని ఓ మహిళకు సైబర్ నేరగాడు ఫోన్‌కాల్ చేసి బెదిరించాడు. భయంతో వణికిపోయిన సదరు బాధితురాలు రూ.60 లక్షలు నేరగాళ్ల ఖాతాలో జమ చేసింది. తర్వాత తాను మోసపోయినట్టు గ్రహించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930కు కాల్ చేసింది. క్షణాల్లోనే స్పందించిన టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిబ్బంది బాధితురాలు పోగొట్టుకున్న రూ.60 లక్షలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా కేవలం గంట వ్యవధిలోనే కాపాడటం జరిగింది.సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ అంటే?⇒ సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోరి్టంగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టంనే సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్గా చెబుతారు. ఇందులో పోలీసులు, సైబర్ సెక్యూరిటీ బ్యూరోల సిబ్బంది, బ్యాంకులు, ఆర్బీఐ, పేమెంట్ వాలెట్లు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర వ్యవస్థలన్నింటికీ ఒక ఉమ్మడి వేదికగా ఈ పోర్టల్ పనిచేస్తుంది.1930 టోల్ ఫ్రీ నంబర్ నుంచి లేదా సైబర్ క్రైం పోర్టల్‌కు బాధితులు డబ్బు పోగొట్టుకున్నట్టు సమాచారం ఇవ్వ గానే ఆ సమాచారాన్ని బ్యాంకు ఖాతా వివరాలు, సమయం, ట్రాన్సాక్షన్ చేసి న విధానం (ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్‌కార్డు లేదా డెబిట్‌కార్డు ద్వారా) ఏ ఖాతా నంబర్‌కు డబ్బులు బదిలీ చేశా>రు..? ఏ సమయంలో చేశారు..? అన్నీ నమోదు చేయగానే సంబంధిత బ్యాంకు వాళ్లకు ఆ వివరాలు వెళతాయి. వెంటనే ఆ డబ్బు అనుమానాస్పద లావాదేవీ కింద గుర్తించి డబ్బులు హోల్డ్ చేస్తారు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే.. అంత ఫలితంసైబర్ నేరగాళ్ల బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మోసపోయినట్టు గుర్తిస్తే.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. లేదా సైబర్ క్రైం పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. వెంటనే సమాచారమివ్వడం వల్ల డబ్బులు బ్యాంకులోనే ఫ్రీజ్ చేయవచ్చు. దీని వల్ల బాధితులు పోగొ ట్టుకున్న డబ్బును కాపాడేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెనువెంటనే సమాచారం ఇచి్చన బాధితుల సొమ్మును చాలా వరకు టీజీసీఎస్బీ కాపాడింది. – శిఖాగోయెల్, డైరెక్టర్, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో -
ట్వీట్లు చేస్తున్నారా.. జర భద్రం..!
సోషల్ మీడియాలో ట్విట్టర్ జోరు రోజురోజుకు పెరిగిపోతోంది. వ్యాపారవేత్తలు, క్రికెటర్స్, రాజకీయ నాయకులు, సినీ తారలు ఇలా చాలా రంగాలకు చెందిన వారు తమ అభిమానులతో ఎన్నో విషయాలను షేరుకుంటున్నారు. ఇందుకు ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ఖాతా వాడుతున్నారు. అయితే ఇప్పటినుంచి అందరు ఒక్క విషయాన్ని గుర్తుంచకోవాలని ఓ రీసెర్చ్ ద్వారా వెల్లడయింది. మన వ్యక్తిగత వివరాలు కొన్ని చెప్పేందుకు మనం చేసే ట్వీట్ లు ఉపయోగపడతాయని తాజా సర్వేలో తేలింది. లోకేషన్ తో పాటు ప్రైవసీకి భంగం వాటిల్లే అవకాశాలే ఎక్కువని యూజర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆక్స్ ఫర్డ్ వర్సిటీకి చెందిన మిట్ రీసేర్చర్స్ కనుగొన్న వివరాలిలా ఉన్నాయి. ట్విట్టర్లో ప్రతిరోజు ట్వీట్లు చేస్తుంటారు కదా.. అయితే రోజు కనీసం 8 ట్వీట్లు చేస్తే వ్యక్తిగత వివరాలు తెలుసుకోవచ్చు. పోస్ట్ చేసిన వ్యక్తి ఎక్కడి నుంచి చేశాడో తెలిసిపోతుందట. ఇవే కాకుండా ఇతరులు పోస్ట్ చేసిన ఫన్నీ వీడియోలకు కామెంట్లు, లైక్స్ కొట్టడంతో కూడా యూజర్స్ అడ్రస్, ఇతర సమాచారం చెప్పే అవకాశాలున్నాయని ఆక్స్ ఫర్డ్ రీసెర్చర్స్ వెల్లడించారు. ట్విట్టర్ లొకేషన్ సర్వీస్ ఆఫ్ చేస్తే ఈ విషయాలు కనిపెట్టేందుకు వీలుండదు. అయితే లొకేషన్ రిపోర్టింగ్ సర్వీస్ టర్న్ ఆఫ్ చేస్తే ప్రైవసీ ఉంటుందన్నారు. కొన్నిసార్లు ఇలా వ్యక్తిగత వివరాలు తెలియడంతో ఉపయోగాలున్నా.. అనర్థాలెన్నో అని ఇంటర్నెట్ పాలసీ రీసెర్చ్ చేసిన విశ్లేషకులు చెబుతున్నారు.