
నిజామాబాద్: కొత్త జీఎస్టీ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ.. భారతీయులకు నవరాత్రి బహుమతి ఇచ్చారన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ‘ సమాజంలోని అన్ని వర్గాలకు కొత్త జీఎస్టీ విధానం మేలు చేస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.
రోజువారీ సామగ్రి పై 18 శాతం నుండి 5 శాతానికి జిఎస్టీ తగ్గించారు. ద్విచక్ర వాహనాలపై 28 శాతం నుండి 18 శాతానికి జీఎస్టీ తగ్గింది. లైఫ్,హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం లు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కొత్త జీఎస్టీ రీఫామ్ ద్వారా దేశ జీడీపీ 1 శాతం పెరిగే అవకాశం ఉంది.
బీజేపీ ప్రభుత్వం లో టాక్స్ ట్రాన్స్పెరెన్స్ విధానం అవుతుంది. రూ. 7 వేల కోట్ల ప్రభుత్వ సొమ్ము ప్రజలకు ఇస్తున్నామని మేము సంతోషిస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి ఆదాయం తగ్గిందని ఏడుస్తున్నారు. ఇదే బీజేపీ-కాంగ్రెస్ నాయకుల మద్యన వ్యత్యాసం’ అని ఎద్దేవా చేశారు అరవింద్.
ఇదీ చదవండి:
అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా: కవిత