మహిళను బలవంతంగా ముద్దుపెట్టుకున్న ఫిజియోథెరపిస్ట్ | Physiotherapist Sexually Harasses Woman Crime News | Sakshi
Sakshi News home page

మహిళను బలవంతంగా ముద్దుపెట్టుకున్న ఫిజియోథెరపిస్ట్

Jun 27 2026 10:56 AM | Updated on Jun 27 2026 11:09 AM

Physiotherapist Sexually Harasses Woman Crime News

చికిత్స కోసం వచ్చిన మహిళతో అసభ్య ప్రవర్తన

ఫిజియోథెరపిస్ట్‌పై శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు

హైదరాబాద్‌, బంజారాహిల్స్‌: చికిత్స కోసం వచ్చిన ఓ మహిళను లైగింక వేధింపులకు గురిచేసిన ఓ ఫిజియోథెరపిస్ట్‌పై శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే జీరో ఎఫ్‌ఐఆర్‌గా నమోదైన కేసు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయింది. ఓ మహిళ భుజం నొప్పితో 2025 ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో మోకిలాలోని 24 ఫిజియోథెరపీ క్లినిక్‌లో చేరింది.

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం–35కు చెందిన ఫిజెయోథెరపిస్ట్‌ రేలంగి సునీల్‌కుమార్‌ ట్రీట్‌మెంట్‌ పేరిట ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమె అనుమతిలేకుండా ముద్దు పెట్టుకున్నాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు నిలదీయగా క్షమాపణ చెప్పాడు. నిందితుడి ప్రవర్తనతో డిప్రెషన్‌కు గురైన బాధితురాలు కౌన్సెలింగ్‌ సైతం తీసుకుంది. నిందితుడు జూబ్లీహిల్స్‌లో అనుమతులు లేకుండానే క్లినిక్‌ నడుపుతున్నాడని,  అధికారుల తనిఖీల సమాచారం తెలియడంతో రాత్రికిరాత్రే పరికరాలు తరలించాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement