సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినీ నటి సురేఖావాణిపై ‘ఎక్స్’లో అభ్యంతరకర, అసభ్యకర పోస్టు పెట్టారంటూ సిటీ సైబ ర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. టీపీసీసీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది కైలాష్ సజ్జన్ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ‘డిగ్ టీవీ ప్యారడీ’పేరుతో ఉన్న ‘డిగ్ టీవీ తెలుగు’ఖాతా నుంచి ఈ పోస్టు వెలువడిందని ఫిర్యాదుదారుడు పోలీసులకు తెలిపారు.
ముఖ్యమంత్రి, సినీ నటి చిత్రాలను కలిపి అసభ్యకర వ్యాఖ్యలు, సంకేతాలతో పోస్టు చేశారని, ఈ పోస్టు ద్వారా సీఎం ప్రతిష్టను దెబ్బతీయడంతో పా టు మహిళా నటిని కించపరిచేలా చిత్రీకరించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించి చర్యలు తీసుకోవాలని, పోస్టు ను తొలగించేందుకు ‘ఎక్స్’సంస్థకు నోటీసులు జారీ చేయాలని కోరారు. ఐపీ లాగ్‌లను భద్రపరచడంతో పాటు ఖాతాను బ్లాక్ చేసే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.


