నేటితో కొత్త ఓటర్ల నమోదుకు బ్రేక్‌ | New voter registration breaks from today | Sakshi
Sakshi News home page

నేటితో కొత్త ఓటర్ల నమోదుకు బ్రేక్‌

Oct 7 2026 5:25 AM | Updated on Oct 7 2026 5:26 AM

New voter registration breaks from today

ముగియనున్న ‘సర్‌’ దరఖాస్తులు, అభ్యంతరాల గడువు 

2026 అక్టోబర్‌ 1తో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులే 

వచ్చే నెల 9న తుది జాబితా ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌)–2026 కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 17న ప్రకటించిన ముసాయిదా జాబితాలో మీ పేరు లేదా? ఏదైనా కారణంతో ఎన్యూమరేషన్‌ ఫారం దాఖలు చేయలేకపోవడంతో ‘సర్‌’ముసాయిదా జాబితాలో మీ పేరు తొలగించారా? ఎన్యూమరేషన్‌ ఫారం దాఖలు చేసినా ముసాయిదా జాబితాలో మీ పేరు రాలేదా? అయితే, ‘సర్‌’ప్రక్రియలో భాగంగా నవంబర్‌ 9న ప్రచురించనున్న తుది ఓటర్ల జాబితాలో మీ పేరు రావాలంటే నేడే (బుధవారం) ఫారం–6 దరఖాస్తును ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో సమర్పించండి. 

ఎందుకంటే సర్‌ కార్యక్రమంలో భాగంగా అభ్యంతరాలతోపాటు కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల వివరాల్లో దిద్దుబాటు/మార్పునకు దరఖాస్తులు చేసుకోవడానికి గడువు బుధవారంతో ముగియనుంది. 2026 అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడి నుంచి కొత్త ఓటరుగా నమోదు కోసం ఫారం–6 దరఖాస్తు చేయాలి. ముసాయిదా జాబితాలో పేరు లేని వారు త్వరలో ప్రకటించనున్న ‘సర్‌’తుది ఓటర్ల జాబితాలో చోటు కోసం ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోకపోయి ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి బుధవా రం ఒక్కరోజే మిగిలి ఉంది. 

ప్రవాస భారతీయుల నుంచి ఓటర్ల నమోదుకు ఫారం–6ఏ దరఖాస్తుతోపాటు ఓటర్ల పేర్లు, ఇతర వివ రాల్లో తప్పుల దిద్దుబాటు/మరో చోటుకి ఓటును బదిలీ చేయడానికి ఫారం–8ను దరఖాస్తు చేయాలి. ఇక ముసాయిదా జాబితాలో అనర్హులైన ఓటర్లు ఎవరైనా ఉంటే వారి పేరు తొలగింపు కోసం ఫారం–7 దర ఖాస్తును చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఓసారి పొడిగించిన గడువు ఈనెల 7తో ముగియనుండగా, మళ్లీ గడువు పొడిగింపు కోరలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్‌ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 

కేంద్ర ఎన్నికల సంఘం పోర్టల్‌ (https://voters.eci.gov.in/) ద్వారా ఆన్‌లైన్‌లో సైతం ఫారం–6/6ఏ/7/8 దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఫారాలను నింపి స్థానిక బూత్‌ స్థాయి అధికారి (బీఎల్‌ఓ)కి సైతం బుధవారంలోగా అందించవచ్చు. గత ఆగస్టు 17 నుంచి దరఖా స్తులు, అభ్యంతరాల స్వీకరణ ప్రారంభించగా, మంగళవారం నాటికి 4.4 లక్షల ఫారం–6, 6,240 ఫారం–6ఏ, 27,555 ఫారం–7, 2,81,443 ఫారం–8 దరఖాస్తులు కలిపి మొత్తం 7.56 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు, అభ్యంతరాలను నవంబర్‌ 5లోగా పరిష్కరించి నవంబర్‌ 9న ‘సర్‌’తుది ఓటర్ల జాబితాను ముద్రించనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement