నేటి నుంచి ఎంఎంటీఎస్‌ కొత్త టైంటేబుల్‌ | New MMTS Timetable Released | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎంఎంటీఎస్‌ కొత్త టైంటేబుల్‌

Jan 1 2025 8:53 AM | Updated on Jan 1 2025 8:53 AM

New MMTS Timetable Released

సాక్షి, హైదరాబాద్: జనవరి 1 నుంచి ఎంఎంటీఎస్‌ కొత్త టైంటేబుల్‌ అమల్లోకి రానుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 88 ఎంఎంటీఎస్‌ సర్వీసులు నడుస్తున్నాయి. సికింద్రాబాద్‌– మేడ్చల్, ఫలక్‌నుమా– ఉందానగర్, ఘట్‌కేసర్‌– లింగంపల్లి మధ్య కొత్తగా ఎంఎంటీఎస్‌ సేవలు విస్తరించాయి. 

ఈ మేరకు వివిధ మార్గాల్లో  ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైళ్ల  వేళల్లో మార్పులు, చేర్పులు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ మార్పులకు సంబంధించిన సమాచారం అన్ని ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో అందుబాటులో ఉంటుందన్నారు. నేషనల్‌ ట్రైన్‌ ఎంక్వైరీ సిస్టమ్‌ ఆధారంగా కూడా తెలుసుకోవచ్చు. సంబంధిత రైల్వే స్టేషన్లలోని  స్టేషన్‌ మేనేజర్, విచారణ కేంద్రాన్ని సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement