సాక్షి, ఢిల్లీ: హైదరాబాద్ మెట్రోపై కేంద్రంతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. మెట్లో ఫేజ్ 2 విస్తరణకు కన్సల్టెంట్‌గా sbicaps నియమించింది. ఇందులో సభ్యులుగా కేంద్ర, రాష్ట్ర అధికారులు ఉండనున్నారు. ఈ రుణసేకరణ, నిర్మాణవ్యయం, విస్తరణపై సమగ్రంగా SBICAPS నివేదిక అందించనుంది, ఆ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా మెట్రో విస్తరణకు, రుణసేకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు అశ్వనీ వైష్ణవ్, ఖట్టర్‌లతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో చర్చలు సఫలమై SBICAPS ను కేంద్రం నియమించింది.


