లోన్‌ యాప్‌ వేధింపులు.. వివాహిత ఆత్మహత్య | Married woman Ends Life In Hyderabad | Sakshi
Sakshi News home page

లోన్‌ యాప్‌ వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

Jun 9 2026 7:24 AM | Updated on Jun 9 2026 12:10 PM

Married woman Ends Life In Hyderabad

మేడ్చల్ జిల్లా: లోన్‌ యాప్‌ వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నేరేట్‌మెట్‌ పోలీసులు తెలిపిన మేరకు..రేవంత్‌కుమార్, దేవనందిని (25) దంపతులు నేరేడ్‌మెట్‌లో నివాసముంటున్నారు. ఈ నెల 7న రేవంత్‌కుమార్‌ బయటకు వెళ్లిన అనంతరం భార్యకు ఫోన్‌ చేశాడు. 

ఆమె స్పందించకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా బెడ్‌ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది.  పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఫోన్‌ను పరిశీలించగా ఓ గుర్తు తెలియని లోన్‌ యాప్‌ ద్వారా రుణం తీసుకున్నట్లు గుర్తించారు. తరచూ ఫోన్‌ చేసి వేధింపులకు గురిచేసినట్లు విచారణలో తేలింది.  ఇదిలా  తండ్రి వెంకట్‌రెడ్డి మాత్రం.. భర్త, అత్తమాల వేధింపుల వల్లనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని వాపోయాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement