రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్
కిడ్నాపర్ వాచ్‌మన్ అని అనుమానం
సాక్షి తెలంగాణ: మేడ్చల్ జిల్లా కౌకూర్‌లో చిన్నారి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. శనివారం బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విల్లా ఆర్కిడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మిల్టన్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తి తన కుమార్తె అరేలియా మౌజెస్ (5)తో కలిసి విల్లా నంబర్ 84లో ఉంటున్నారు.
అదే విల్లాలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న విక్రమ్ కిడ్నాప్‌నకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. చిన్నారిని విడిచిపెట్టాలంటే రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. బొల్లారం పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం విల్లా పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
దీని వెనుక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బొల్లారంలో కిడ్నాప్ అయిన ఈ చిన్నారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో మల్కాజ్‌గిరి పోలీసులు సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి సమయంలో డ్రోన్ కెమెరాలతోనూ పాప ఆచూకీ కోసం గాలించారు.
ఇదీ చదవండి: ప్రేమ పేరుతో వేధింపులు.. 15 ఏళ్ల బాలిక బలవన్మరణం!


