‘కింగ్స్‌ అండ్‌ క్వీన్‌’ ఓ మచ్చుతునక మాత్రమే | Kings Queens Pub Manager Arrest Police Raids In Pubs | Sakshi
Sakshi News home page

‘కింగ్స్‌ అండ్‌ క్వీన్‌’ ఓ మచ్చుతునక మాత్రమే

Jun 8 2026 7:22 AM | Updated on Jun 8 2026 7:22 AM

Kings Queens Pub Manager Arrest Police Raids In Pubs

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని కొన్ని పబ్బులు అసాంఘిక కార్యకలాపాలకు, దందాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి. ఈ క్రమంలోనే కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌ డెకాయ్‌ ఆపరేషన్‌ చేయడంతో మంజీరా మాల్‌లోని కింగ్స్‌ అండ్‌ క్వీన్స్‌ పబ్‌ వ్యవహారం వెలుగులోకి వచి్చంది. స్థానిక పోలీసులతో కుమ్మక్కై తమ వ్యవహారాలు కొనసాగిస్తున్నాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి దందాలకు వ్యవస్థీకృతంగా నడపటంతో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతడితో పాటు అతడు నడిపిన పబ్స్‌పై గతంలోనూ అనేక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. 

యువతులను రప్పించి..   
ఈ పబ్స్‌ దందాలో ఏళ్లుగా ఉన్న ఓ వ్యక్తి వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకువస్తున్నాడని తెలిసింది. అలా వచ్చే వారికి బస, భోజనం తదితరాలన్నీ అతడే సమకూరుస్తుంటాడు. ఇక్కడ ఉన్నన్ని రోజులూ వారు వినియోగించడానికి తాత్కాలిక ఫోన్లు, నెంబర్లు వారిని తీసుకువచి్చన వాళ్లే కేటాయిస్తున్నారు. ఓసారి పబ్‌కు వచి్చన యువకుల ఫోన్‌ నెంబర్లు ఈ యువతులు తీసుకుంటారు. తమ వద్ద ఉన్న తాత్కాలిక నెంబర్లకు వారికి ఇస్తారు. ఇలా నిత్యం వారితో చాటింగ్‌ చేస్తూ పదేపదే అదే పబ్‌కు వచ్చేలా ఆకర్షిస్తుంటారు. ఇలా చేసిందుకు నిర్వాహకులు వీరికి అదనంగా చెల్లిస్తారు. కొన్ని సందర్భాల్లో కస్టమర్‌ చేసిన బిల్లు నుంచి కమీషన్‌ కూడా ఇస్తారు. దీనికి అదనంగా ఆయా యువకుల నుంచి ఈ యువతులు కంపెనీ ఇచి్చనందుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తుంటారు.  

కొన్ని చోట్ల శ్రుతి మించి..
ఈ యువతీ యువకుల వ్యవహారాలు పబ్‌లకు ఆకర్షించడం, మద్యం తాగడం.. తాగించడం, డ్యాన్సులతో ఆగట్లేదు. ఇదే అదనుగా ద్వితీయ, తృతీయ శ్రేణులకు చెందిన కొన్ని పబ్స్‌లో అసాంఘిక కార్యకలాపాలు శ్రుతి మించుతున్నాయి. దీనికోసం ఆయా చోట్ల ఏకాంత ప్రదేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అదనంగా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ యువతుల వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తిపై ఈ దందాలతో పాటు ఓ డ్యాన్సర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన కేసు కూడా నమోదైనట్లు తెలిసింది. అతడి వ్యవహారాలు ఆయా ఠాణాలకు చెందిన అధికారులకు తెలిసినా ‘అనివార్య కారణాల’ నేపథ్యంలో మిన్నకుండిపోతున్నారని సమాచారం. ఇకపైనా టాస్‌్కఫోర్స్, ఎస్‌ఓటీలతో పాటు లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు పబ్స్‌లో జరిగే అసాంఘిక కార్యకలాపాలు, అక్రమాలకు చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement