అంజలిని హత్య చేయడంలో తప్పులేదు: నిందితుడి తల్లి | Jeedimetla Daughter Mother incident | Sakshi
Sakshi News home page

అంజలిని హత్య చేయడంలో తప్పులేదు: నిందితుడి తల్లి

Jun 26 2025 6:19 AM | Updated on Jun 26 2025 6:41 AM

 Jeedimetla Daughter Mother incident

తొలుత అంగీకరించి.. ఆ తర్వాత అడ్డు చెప్పిందని.. 

పోలీసు కేసు పెట్టించిందని కన్నతల్లిపై కోపం   

ఆమెను చంపడమే పరిష్కారమని ప్రేమికుడికి పిలుపు   

ప్రియుడు, అతని సోదరుడితో కలిసి అమ్మను చంపించిన బాలిక 

జీడిమెట్ల దారుణం కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్‌  

 వివరాలు వెల్లడించిన బాలానగర్‌ డీసీపీ శ్రీనివాస్‌  

జీడిమెట్ల(హైదరాబాద్): ప్రియుడు, అతని సోదరుడితో కలిసి పదో తరగతి బాలిక కన్నతల్లిని చంపించిన కేసులో పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. బుధవారం షాపూర్‌నగర్‌లో బాలానగర్‌ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్‌ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ నరే‹Ùరెడ్డి, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ మల్లేష్‌  డీఐ కనకయ్యలతో కలిసి విలేకరుల  సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తికి చెందిన సట్ల అంజలి (39) తెలంగాణ సాంస్కృతిక శాఖలో కళాకారిణి. అంజలి తన ఇద్దరు కుమార్తెలు (16), (12)లతో కలిసి షాపూర్‌నగర్‌లోని హెచ్‌ఎంటీ సొసైటీలో నివసిస్తోంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పెద్ద కుమార్తె పదో తరగతి చదువుతోంది. ఆమెకు ఎనిమిది నెలల క్రితం నల్లగొండ జిల్లా కట్టంగూర్‌కు చెందిన శివ (18)తో ఇన్‌స్టాలో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. వీరి ప్రేమను బాలిక తల్లి అంజలి తొలుత అంగీకరించినా.. ఆ తర్వాత వ్యతిరేకించసాగింది. బాగా చదువుకోవాలని కుమార్తెకు చెబుతూనే ప్రేమ విషయంలో మందలించేది.  

తల్లి మందలించడంతో ప్రియుడి చెంతకు.. 
ఈ క్రమంలో ఈ నెల 8న బాలిక తన సోదరిని తీసుకుని కట్టంగూర్‌కు వెళ్లి నాలుగు రోజులు ఉండి వచి్చంది. ఇది నచ్చని తల్లి కుమార్తెను తీవ్రంగా మందలించింది. తనను మందలించడంతో తల్లిపై కోపం పెంచుకున్న బాలిక ఈ నెల 19న కట్టంగూర్‌లోని ప్రియుడు శివ వద్దకు వెళ్లిపోయింది. మరునాడు బాలిక తల్లి అంజలి తన కూతురుని శివ కిడ్నాప్‌ చేశాడంటూ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శివపై కేసు నమోదు చేసి బాలికను తల్లి అంజలికి అప్పగించారు. 

అంజలికి అదే శాపమైంది..  
ఈ నెల 22న తన చెంతకు చేరిన కుమార్తెను తల్లి అంజలి గట్టిగా మందలించడంతో పాటు చేయి చేసుకుంది. శివను జైలుకు పంపిస్తానని భయపెట్టింది. దీంతో తన ఇష్టానికి అడ్డుగా వస్తున్న తల్లిని ఎలాగైనా చంపాలని బాలిక గట్టిగా నిర్ణయించుకుంది. 23న సాయంత్రం శివను షాపూర్‌నగర్‌ వచ్చి తన తల్లిని హత్య చేయాలని కోరింది. దీనికి శివ అభ్యంతరం చెప్పడంతో..  అయితే తానే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో శివ... పదో తరగతి చదువుతున్న తన తమ్ముడి (16)ని తీసుకుని గత సోమవారం సాయంత్రం షాపూర్‌నగర్‌ వచ్చాడు. బాలిక ఇంటి బయట కాపలా కాయగా.. శివ, అతని సోదరుడు లోపలికి వెళ్లి అంజలి మెడకు చున్నీతో గట్టిగా ఉరి బిగించి హత్య చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో మంగళవారం తెల్లవారుజామున శివను కట్టంగూర్‌లో, అతని సోదరుడిని, బాలికను నగరంలో అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అంజలిని తామే చంపినట్లు ఒప్పుకొన్నారు.  ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. 

Jeedimetla: ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన కూతురు

మొదటి నుంచీ తల్లి అంటే కుమార్తెకు గిట్టేది కాదు.. 
నిందితురాలు బాలిక (16)కు తల్లి అంజలి అంటే గిట్టేది కాదు. 7వ తరగతిలోనే తల్లి వద్ద ఉండను అంటూ అప్పట్లోనే పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో అంజలి తన కూతురును రెండేళ్ల పాటు గుండ్లపోచంపల్లిలోని సోదరి ఇంట్లో ఉంచింది. మూడు నెలల క్రితమే బాలిక తల్లి వద్దకు వచి్చనట్లు తెలుస్తోంది. బాలికకు మొదటి నుంచీ తల్లితో శత్రుత్వమే అని.. తరచూ తల్లి తరచూ తనపై చేయి చేసుకొంటోందని బాలిక తన గోడును స్నేహితులతో వెళ్లబోసుకునేదని తెలిసింది. కేసును కొన్ని గంటల్లోనే ఛేదించిన జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ మల్లే‹Ù, డీఐ కనకయ్య, సిబ్బందిని డీసీపీ అభినందించారు.

అంజలిని హత్య చేయడంలో తప్పులేదు: నిందితుడి తల్లి 
జీడిమెట్లలో అంజలి హత్యోదంతం కేసులో నిందితుడు శివ తల్లి ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలిక తల్లి అంజలిని తన కుమారులు హత్య చేయడాన్ని ఆమె సమరి్థంచుకుంది. మొదట్లో శివ ప్రేమకు అంగీకారం తెలిపిన అంజలి.. ఆ తర్వాత ఒప్పుకోకపోవడం వల్లే  ఆమెను తన కొడుకులు హత్య చేశారని చెప్పుకొచి్చంది.  

తల్లికి తలకొరివి పెట్టిన చిన్నకూతురు కేసముద్రం: జీడిమెట్లలో హత్యకు గురైన 
అంజలి అంత్యక్రియలు బుధవారం ఆమె స్వగ్రామం మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తిలో జరిగాయి. ఆమె మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌తో పాటు, వివిధ పారీ్టలు, ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు సందర్శించి నివాళులరి్పంచారు. అనంతరం తల్లి మృతదేహానికి చిన్న కుమార్తె మనస్విని తలకొరివి పెట్టింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement