గృహ ప్రవేశం వేడుకల్లో కర్రలు, రాళ్లతో బీభత్సం | Hyderabad Gated Ceremony Turns Violent After Mob Attack In Medipally, Several Injured And Vehicles, Property Damaged | Sakshi
Sakshi News home page

గృహ ప్రవేశం వేడుకల్లో కర్రలు, రాళ్లతో బీభత్సం

Jun 29 2026 11:26 AM | Updated on Jun 29 2026 11:45 AM

Hyderabad Boduppal Rowdies Incident

హైదరాబాద్‌: గృహ ప్రవేశం వేడుకల ఆనందం క్షణాల్లోనే భయానకంగా మారింది. దాదాపు 50 మంది గూండాలు గుంపుగా వచ్చి రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి సామగ్రి, ఫరి్నచర్, కిటికీ అద్దాలు, 3 బైకులు, 4 కార్లను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించిన ఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి బోడుప్పల్‌ దేవేందర్‌ నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..

హిమాయత్‌నగర్‌కు చెందిన శ్యామ్‌ రావు దేవేందర్‌ నగర్‌లో శనివారం గృహ ప్రవేశం చేశారు.  రాత్రి కుటుంబ, సభ్యులు, బంధువులు బయట కూర్చుని ఉండగా.. ఇదే ప్రాంతానికి చెందిన యాకయ్య మద్యం తాగి వచ్చి ఎవరిని అడిగి ఇల్లు కొన్నారంటూ వాగ్వాదానికి దిగాడు. శ్యామ్‌రావు కుటుంబ సభ్యులు సముదాయించి పంపించారు. కొద్ది సేపటికి యాకయ్య కుమారుడితో కలిసి దాదాపు 50 యువకులను తీసువచ్చి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అడ్డొచి్చన మహిళలు, వృద్ధులపైనా దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. కార్లు, బైకులపై దాడికి పాల్పడ్డారు.

 గొడవను ఆపేందుకు ప్రయతి్నంచిన పక్కింటి వ్యక్తినీ కొట్టారు. సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేశారు. బాధిత కుటుంబం ఇంటికి తాళం వేసి వెళ్లి పోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు యాకయ్య, అతడి కుమారుడితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా.. దేవేందర్‌ నగర్‌లో బెల్టుషాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, గంజాయి సేవిస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement