భార్యను రివాల్వర్‌తో కాల్చి చంపిన భర్త..! | Husband And Wife Ends Life Karimnagar | Sakshi
Sakshi News home page

విషాదం.. భార్యను రివాల్వర్‌తో కాల్చి చంపిన భర్త..!

Jun 11 2025 11:44 AM | Updated on Jun 11 2025 1:03 PM

Husband And Wife Ends Life Karimnagar

 అయిలాపూర్‌ గ్రామంలో విషాదం 

కోరుట్ల(కరీంనగర్): రెండ్రోజుల క్రితం ముంబయిలోని వర్లిలో కుటుంబ కలహాలతో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో కోరుట్ల మండలం అయిలాపూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం దంపతుల అంత్యక్రియలు అయిలాపూర్‌లో ఒకే చితిపై నిర్వహించారు.

 కోరుట్ల మండలం అయిలాపూర్‌కు చెందిన నాంపల్లి రాజమనోహార్‌(62), లత(51) దంపతులు కొన్నేళ్లుగా కొడుకు– కోడలుతో కలిసి ముంబయిలోని వర్లిలో నివాసముంటున్నారు. కుటుంబంలో చిన్నపాటి కలహాలు నెలకొనడంతో ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో రాజమోహన్‌(62) తన వద్ద ఉన్న కంట్రీమేడ్‌ రివాల్వర్‌తో భార్య లతను కాల్చిచంపాడు. 

అనంతరం రాజమోహన్‌ తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వర్లి పోలీసులు ఈ సంఘటనదపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా, పోస్టుమార్టం అనంతరం దంపతులు రాజమోహన్‌–లత మృతదేహాలు మంగళవారం స్వగ్రామం అయిలాపూర్‌కు తీసుకువచ్చారు. దంపతుల మృతదేహాలను ఒకే చోట చితిపై ఉంచి అంత్యక్రియలు పూర్తి చేసిన వైనం స్థానికులను కంటతడి పెట్టించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement