చార్మినార్‌ నుంచి ఊడిపడ్డ పెచ్చులు.. తప్పిన పెను ప్రమాదం.. | Heavy Rain: Pieces of the Historic Charminar Fall Down | Sakshi
Sakshi News home page

చార్మినార్‌ నుంచి ఊడిపడ్డ పెచ్చులు.. తప్పిన పెను ప్రమాదం..

Apr 3 2025 6:20 PM | Updated on Apr 3 2025 7:21 PM

Heavy Rain: Flakes Of Historic Charminar Fell Down

చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. గతంలో మరమ్మతులు చేసిన చోటే మళ్లీ పెచ్చులు ఊడి కిందపడ్డాయి.

సాక్షి, హైదరాబాద్‌: చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. గతంలో మరమ్మతులు చేసిన చోటే మళ్లీ పెచ్చులు ఊడి కిందపడ్డాయి. భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్న చార్మినార్‌ నుంచి పెచ్చులు పడటంతో పర్యాటకులు పరుగులు తీశారు. పెచ్చులూడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. పరిస్థితిని సమీక్షించారు. ఊడిపోయిన పెచ్చులను జీహెచ్‌ఎంసీ సిబ్బంది శుభ్రం చేశారు. చార్మినార్‌కు మరోమారు మరమ్మతులు చేస్తామని అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్‌లో ఇవాళ అకాల వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం మధ్యాహ్నాం నుంచి ఉరుములతో, మెరుపులతో భారీగా వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు ఏరులై పారుతోంది. హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా రోడ్లు నీట మునిగాయి. పంజాగుట్ట-ఖైరతాబాద్‌ ప్రధాన రహదారిపై మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మెర్క్యూరీ హోటల్‌ వద్ద ఓ కారుపై చెట్టు కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు.


 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement