flakes of cement
-
చార్మినార్ నుంచి ఊడిపడ్డ పెచ్చులు.. తప్పిన పెను ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. గతంలో మరమ్మతులు చేసిన చోటే మళ్లీ పెచ్చులు ఊడి కిందపడ్డాయి. భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్న చార్మినార్ నుంచి పెచ్చులు పడటంతో పర్యాటకులు పరుగులు తీశారు. పెచ్చులూడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. పరిస్థితిని సమీక్షించారు. ఊడిపోయిన పెచ్చులను జీహెచ్ఎంసీ సిబ్బంది శుభ్రం చేశారు. చార్మినార్‌కు మరోమారు మరమ్మతులు చేస్తామని అధికారులు వెల్లడించారు.హైదరాబాద్‌లో ఇవాళ అకాల వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం మధ్యాహ్నాం నుంచి ఉరుములతో, మెరుపులతో భారీగా వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు ఏరులై పారుతోంది. హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా రోడ్లు నీట మునిగాయి. పంజాగుట్ట-ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మెర్క్యూరీ హోటల్ వద్ద ఓ కారుపై చెట్టు కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. -
వినాయక మండపం వద్ద భక్తులకు తప్పిన పెను ప్రమాదం
విశాఖపట్నం: విశాఖపట్నంలో వినాయక మండపం వద్ద భక్తులకు పెను ప్రమాదం తప్పింది. ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన చాక్లెట్ వినాయక మండపం వద్ద ఈదురు గాలులకు మండపంపై రేకులు ఎగిరిపడ్డాయి. దీంతో వెనుకనే కూర్చున్న భక్తులపై సిమెంట్ రేకులు పడ్డాయి. భక్తులు తప్పుకోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఓ వ్యక్తికి తలపై ఇనుప రాడ్డు పడింది. స్వల్ప గాయాలు అయ్యాయి. నిబంధనలు పాటించకుండా స్టాల్స్ ఏర్పాటుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: తిరుమల: నాడు వైఎస్సార్.. నేడు సీఎం జగన్: భూమన -
స్తంభించిన రైళ్లు
విశాఖపట్నం సిటీ: తూర్పు కోస్తా రైల్వేలోని ప్రధానమైన విశాఖ రైల్వే స్టేషన్ చిగురుటాకులా వణికిపోయింది. శనివారం అర్ధరాత్రి నుంచే మొదలైన గాలులకు రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. భీకర గాలులకు ఎగిరిపోతున్న పైకప్పులను సరి చేసే లోపే మరో ప్లాట్‌ఫాం మీద వున్న పై కప్పులు ఎగిరిపోతుండడంతో ఆఖరికి సిబ్బంది సైతం చేతులెత్తేశారు. ప్లాట్‌ఫార పై ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. ప్లాట్‌ఫాంపై వున్న ఐఆర్సీటీసీ దుకాణాలన్నీ బంతుల్లా దొర్లాయి. విశాఖ రైల్వే స్టేషన్‌లోని 8 ప్లాట్‌ఫాంలపై ఉన్న ఆస్బెస్టాస్ సిమెంట్ రేకులు, ఐరన్ షీట్లు కాగితాల్లా ఎగిరిపోయాయి. అత్యవసర ప్రయాణాలు చేద్దామనుకున్న వారంతా చిగురుటాకుల్లా వణికిపోయారు. రైళ్లరద్దుతో వేలాది మంది ప్రయాణికులు వచ్చి టికెట్లు రద్దు చేసుకుంటారనుకున్నా భయంకర తుఫాన్‌కు ఎవరు స్టేషన్ వైపు రాలేదు. వచ్చిన వారు మాత్రం ఎటూ వెళ్లలేక స్టేషన్లోనే దిగాలుగా పడిగాపులు కాస్తున్నారు. ఏ సమాచారం తెలియక తంటాలు పడుతున్నారు. రైల్వే ఉద్యోగులు సైతం ఆదివారం విధుల్లోకి రావాల్సిన వారంతా రాలేదు. దీంతో శనివారం రాత్రి విధుల్లో వున్న వారే ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఖాళీ రైళ్లు ఢీ: తూర్పు కోస్తా రైల్వే చిగురుటాకులా వణికిపోయింది. హుదూద్ తుఫాను బీభత్సం సృష్టించనుందని ముందే హెచ్చరించడంతో దాదాపు 50కు పైగా రైళ్లను ఎక్కడున్న వాటిని అక్కడే నిలిపివేసినా వాటిని నియంత్రించడం కష్టతరమైంది. విశాఖలో నిలిపివేసిన పలు రైళ్లు భారీ ఈదురుగాలులకు పట్టాలపై దొర్లుకుపోవడం రైల్వే వర్గాలను కలవరపెట్టాయి. అందులో ప్రయాణికులు లేకపోయినా ఈదురు గాలులకు రైళ్లు సైతం కొట్టుకుపోతున్నాయని కలవరపడ్డారు. ఆదివారం రోజంతా అవి ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూనే ఉన్నాయి. బ్రేక్‌లపై నిలిపివేసిన రైళ్లు సైతం చిగురుటాకుల్లా దొర్లిపోయేవి. వాటిని పట్టాలపై నియంత్రించడం సాధ్యమయ్యేది కాదు. ప్రయాణాలకు బ్రేక్ గత రెండు రోజులుగా విశాఖలో హుదూద్ చేస్తున్న హడావుడితో పలువురు ప్రయాణాలు బ్రేక్ చేసుకున్నారు. వేలాది మంది తమ టికెట్లను శనివారం రాత్రే రద్దు చేసుకున్నారు. దాదాపు నాలుగు నుంచి 5 వేల మంది ప్రయాణికులకు రూ. కోట్లలో చెల్లింపులు(రిఫండ్) చేశారు. మరో రెండు మూడు రోజుల వరకూ ప్రయాణాల పరిస్థితి మందకొడిగానే కొనసాగే అవకాశాలున్నాయి.