హైదరాబాద్‌లో వర్షం.. మరో రెండు గంటల్లో.. | Heavy Rain Alert To Telangana And AP | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో వర్షం.. మరో రెండు గంటల్లో..

Jun 21 2026 7:06 AM | Updated on Jun 21 2026 11:08 AM

Heavy Rain Alert To Telangana And AP

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లో మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో, వాతావరణం చల్లబడింది. కాగా, తెలంగాణలో రానున్న రెండు గంటల్లో సంగారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మేడ్చల్‌, సిద్దిపేట, యాదాద్రి, కరీంనగర్‌, భూపాలపల్లి, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట సహ పలు జిల్లాలో మోస్తరు నుంచి కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.

మరోవైపు.. రానున్న మూడు గంటల్లో ఏపీలోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలను జారీ చేసింది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా  జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మచిలీపట్నం, ఏలూరు, నర్సాపూరం, దివిసీమ, గుడివాడ, భీమడోలు పరిసర ప్రాంతాల్లో పిడుగుపాటు హెచ్చరిక.. అలాగే, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌తో పాటుగా పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈదురు గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెట్ల క్రింద, హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని సూచించింది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement